కష్టాల్లో కబాలి నిర్మాత.. అరెస్టు చేయండని కోర్టు అదేశాలు Tamil film producer Kalaippuli S Thanu lands in trouble

Tamil film producer kalaippuli s thanu lands in trouble

Kalaippuli S Thanu, Kabali producer, Tamil cinema producer, Tamil cinema production, Kollywood producer, Thirumagan, SJ Suriya, chennai City Civil Court, david, theater owner, old debts, Rajani kanth, producer, S.Thanu, court notices,

Kalaippuli' S Thanu, a leading producer in the Tamil film industry and president of the Tamil Film Producers Council, has landed in trouble.

కష్టాల్లో కబాలి నిర్మాత.. అరెస్టు చేయండని కోర్టు అదేశాలు

Posted: 11/02/2016 03:08 PM IST
Tamil film producer kalaippuli s thanu lands in trouble

కబాలి చిత్ర నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్‌.థానును కష్టాలు ముంచెత్తనున్నాయి. అదేంటి కబాలీ సినిమా డివైట్ టాక్ వచ్చిన మంచి లాభాలనే కురిపించింది కదా..? అంటారా. అవునండీ మీరంటున్నది కరెక్టే.. కానీ అయన వద్ద రెండు లక్షల రూపాయలకు కూడా లేకపోవడమే కష్టాలకు కారణం. అయితే కష్టాలు కొనితెచ్చిన బహుమానం వింటే షాక్ అవ్వక తప్పదు. కారగారవాసం. అర్థం కాలేదా?

వివరాల్లోకి వెళ్తే.. కబాలీ సినీమ డైరెక్టర్ థానును తక్షణం అరెస్టు చేయాలంటూ చెన్నైలోని నాగర్‌కోవిల్‌ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కన్యాకుమారీకి చెందిన క్యూ థియేటర్‌ యజమాని డేవిడ్‌ కు రెండు లక్షల రూపాయలను చెల్లించాలని అదేశించినా.. గత మూడు సంవత్సరాలుగా వాటిని చెల్లించకపోవడంతో తమిళానాడు నిర్మాతల మండలి అధ్యక్షుడు ధానును తక్షణం అరెస్టు చేసి ఈ నెల 28న తన ముంగిట హాజరుపర్చాలని న్యాయస్థానం అదేశించింది. దీంతో థానుకు కష్టాలు మొదలయ్యాయి.

2009లో ఎస్ జే సూర్య నటించిన తరుమగన్ చిత్రానికి సంబంధించి తాను ఎదుర్కోన్న నష్టాల విషయంలో తనకు నిర్మాత రెండు లక్షల రూపాయలను చెల్లించాలని, 2009లోనే డేవిడ్ నిర్మాత ధానుపై కోర్టులో పిటీషన్ సమర్పించాడు, ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం రెండు లక్షల రూపాయలను చెల్లించి వివాదాన్ని సర్ధుకోవాల్సిందిగా న్యాయస్థానం నిర్మాత ధానును అదేశించింది. అయితే తన వద్ద ఇప్పుడు లేవని తాను తరువాత చెల్లిస్తానని చెప్పి వెళ్లాడు.
 
ఇలా మూడేళ్లు గడిచాయి. ఆ తరువాత కూడా రెండు బంపర్ హిట్ చిత్రాలు ధేరి, కబాలి లు హిట్ కోట్టిన తరువాత కూడా చెల్లించలేదు. దీంతో డేవిడ్ మరోమారు న్యాయస్థానాన్ని అశ్రయించాడు.  థాను డబ్బులు వుంచుకొని కూడా తనకు రావలసిన రెండు లక్షల రూపాయలను చెల్లించకుండా దాటవేత దోరణిని అవలంభిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దాంతో నాగర్‌కోవిల్‌ కోర్టు ఈ నెల 28వ తేదీలోగా నిర్మాత థానును అరెస్ట్‌ చేయాలని మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kabali  Rajani kanth  producer  S.Thanu  court notices  david  kollywood  

Other Articles