ఓఆర్ఓపి కోసం మాజీ సైనికుడి ఆత్మహత్య.. కేంద్రంపై విమర్శల వెల్లువ Ex-jawan kills self allegedly over OROP

Ex serviceman commits suicide at jantar mantar over orop

One Rank One Pension, Ex-serviceman commits suicide, Ram Kishan Grewal, suicide, jantar mantar, delhi, PM Modi, Aravind kejriwal, Rahul Gandhi, BJP, AAP, congress

Ex-serviceman Ram Kishan Grewal committed suicide by consuming poison at Delhi's Jantar Mantar area.

ఓఆర్ఓపి కోసం మాజీ సైనికుడి ఆత్మహత్య.. కేంద్రంపై విమర్శల వెల్లువ

Posted: 11/02/2016 12:49 PM IST
Ex serviceman commits suicide at jantar mantar over orop

ఢిల్లీలో ఓ మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్లను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మాజీ సైనికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓఆర్ఓపి పెన్షన్ విధానాన్ని కేంద్రం ప్రకటించి ఏడాది గడుస్తున్నా కేంద్రం దానిని అమలు పర్చడంలో జాప్యం చేయడం ఇంకా మీనమేషలు లెక్కించడంతో హరయానాకు  చెందిన మాజీ సైనికుడు రాం కిషన్ గ్రేవాల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఢిల్లీకి వెళ్లి ఓఆర్ఓపీ కోసం మాజీ సైనికులు అందరూ కలసి ఉద్యమించిన జంతర్ మంతర్ ప్రాంత అవరణలోనే తన ప్రాణాలు తీసుకున్నారు. గతంతో ఇక్కడ జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన కూడా పాలుపంచుకున్నాడు. తన చావు ద్వారానైనా ప్రభుత్వం మాజీ సైనికులకు న్యాయం చేయాలని రాం కిషన్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక సూసైడ్ నోట్ ను కూడా రాశారు. అటు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సైనికులను కేంద్ర ప్రభుత్వం మోసం చేయడం వల్లే  రాం కిషన్ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు.

ఇదే సమయంలో పలు విపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కార్ కేవలం తమ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తూడిచేసేందుకే సైనికులను నామజపం చేస్తుంది తప్ప.. నిజానికి వారి సంక్షేమానికి కట్టుబడి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ అన్న అంశాన్ని కేంద్రం తమ పార్టీ మైలేజ్ కోసం వాడుకోవడం తప్ప.. చేసిందేమీ లేదన్న విమర్శలు వినబడతున్నాయి.

ఇక కాంగ్రెస్ నేతలు.. తమ యువనేత రాహుల్ గాంధీ మాజీ సైనికుల సంక్షేమం కాంక్షిస్తూ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసినా.. ఆయన స్పందించలేదని ఇది కూడా మాజీ సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందని విమర్శిస్తున్నారు. సైనికుల జీవితాలకు వెలుగునివ్వండీ అని తమ నేత రాహుల్ కోరినా ప్రధాని పట్టించుకోకపోవడం వల్లనే మాజీ సైనికుడి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పటికైనా వారి దీపావళి శుభాకాంక్షల బదులు జీవితాలకు వెలుగునిచ్చే పనులు చేపట్టాలని విన్నవించారు. ఇలాంటి ఘటనల వల్ల దేశ సైనికుల అథ్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదముందని కాంగ్రెస్ నేతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ex-serviceman  Ram Kishen Grewal  suicide  one rank one pension  delhi  

Other Articles