తస్మాత్ జాగ్రత్తా! ఆ పరీక్షలకు బూట్లుతో రానీవ్వరూ.. ఇంకా.. tspsc issues instructions for group 2 exam candidates

Tspsc issues instructions for group 2 exam candidates

tspsc, tspsc group 2, group 2 exams, instructions, shoes, identity cards, tspsc group 2 hall ticket, group 2 hall ticket, tspsc group 2 admit card, telangana group ii admit card 2016, telangana group 2 hall ticket 2016, www.tspsc.gov.in, tspsc group 2 hall ticket download

telangana service public service commission issues instructions for group 2 exam candidates, who are attending exams on Nov 11 and 13

తస్మాత్ జాగ్రత్తా! బూట్లతో ఆ పరీక్షలకు ప్రవేశం లేదు.. ఇంకా..

Posted: 11/01/2016 07:44 PM IST
Tspsc issues instructions for group 2 exam candidates

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ టు పరీక్షలకు టీఎస్‌పీఎస్సీ పగడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. 1,032  పోస్టుల భర్తీకి గాను నిర్వహించనున్న ఈ పరీక్షలకు ఈ నెల 11, 13 తేదీలలో రాత పరీక్షలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులకు పలు సూచనలు జారీ చేసింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ సూచనలను తప్పక పాటించాలని, లేని పక్షంలో వారిని పరీక్షలకు సైతం అనర్హులుగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపింది.

గ్రూప్ 2 పరీక్షలకు రికార్డు స్థాయిలో 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారికి రాష్ట్రవ్యాప్తంగా 1,911 పరీక్షా కేంద్రాలలో పరీక్షలను నిర్వహించనున్నాట్లు టీఎస్పీఎస్పీ తెలిపింది. నవంబర్ 11న పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగగా, హిస్టరీ, పాలిటీక్స్ అండ్ సొసైటీ లతో కూడిన  పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపింది.

ఇక నవంబర్ 13న పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. పేపర్-4 తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరింది. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని సూచించింది. పూర్తిస్థాయి సూచనల కోసం తమ వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కోంది.
 
 
అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ సూచనలు:
 
* అభ్యర్థులు బూట్లు, నగలు, చెవిపోగులు, చేతి గడియారాలు ధరించకూడదు.
* ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లు, లాగ్‌ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, నోట్‌బుక్స్, చార్టులు, రికార్డింగ్‌ పరికరాలకు తీసుకురారాదు.
* చేతి వేళ్లపై గోరింటాకు(మెహందీ), ఇంక్‌ వంటివి లేకుండా చూసుకోవాలి.
* అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలని పేర్కొంది.
* హాల్‌ టికెట్‌పై ఫొటో కానీ, సంతకం కానీ సరిగా లేని అభ్యర్థులు.. రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను తెచ్చుకోవాలి.
* ఓఎంఆర్‌ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నుతోనే రాయాలి.
* పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్‌ జవాబు పత్రాలను అనర్హతగా ప్రకటిస్తాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tspsc  group 2 exams  instructions  shoes  identity cards  hall ticket download  

Other Articles