అరచేతిలో వైకుంఠం చూపితే.. పార్టీలు.. అంతే సంగతులు.. Don't promise the moon to voters says EC

Don t make empty promises to voters or face stern action ec tells political parties

Shiromani Akali Dal, political parties affidavits, election commission, political parties, empty parties, five state assembly elections, uttar pradesh, punjab,gujarat, goa, Manifesto

To keep a check on the ‘impractical promises’, the Election Commission has said that it will crack down on parties that go overboard with their manifesto promises to lure the electorate.

‘‘అరచేతిలో వైకుంఠం’’ చూపితే.. అంతే సంగతులు..

Posted: 11/01/2016 07:12 PM IST
Don t make empty promises to voters or face stern action ec tells political parties

గల్లీ స్థాయి అదేనండీ వార్డు సభ్యుల ఎన్నికల నుంచి ఢిల్లీ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని స్థాయి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లకు హామీలను గుప్పిస్తూనే వుంటాయి. అరచేతిలో వైకుంఠాన్ని చూపి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తాయి. ఇంతవరకు బాగానే వున్నా ఇచ్చిన హామీలను ఇకపై అచరణలో పెట్టకపోతే మాత్రం చర్యలు తప్పవంటున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికలలో గెలుపు కోసం అకాశంలోని చంద్రుడిని కిందకు తీసుకోస్తామన్నట్లుగా పార్టీలో పోటీపడి మారీ హామీలను ఇవ్వడంపై తీవ్రస్థాయిలో మండిపడింది.

గతంలో పంజాబ్ లోని అధికార అకాళీదళ్ పార్టీ ఇలాంటి పనులనే చేపట్టిందని, అయితే లోటు బడ్జెట్ కారణంగా ఎన్నికల హామీలను అమలుపర్చ లేకపోయిందని కూడా చెప్పింది. అయితే వారిపై చర్యలు తీసుకోవడాన్ని ఈ సారికి మినహాయించిన ఎన్నికల సంఘం.. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో రాజకీయ పార్టీలు అధికారం కోసం అచరణ సాధ్యంకానీ హామీలను ఇచ్చినా.. లేక ఇచ్చిన అఃహామీలను అమలుపర్చకపోయినా ఆయా పార్టీలపై చర్యలు తప్పవని చెప్పింది.

పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలను అమలుచేయడానికి ప్రభుత్వాలకు ఆర్థికంగా చాలా భారం పడుతోందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. కేవలం ఆ హామీలు ఇస్తే మాత్రమే ఓటర్ల విశ్వాసం పొందగలమని ఆ పార్టీలు భావిస్తున్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీ ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పింది గానీ, రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల అప్పులు ఉండటంతో ఆ హామీ నెరవేర్చలేదని ఉదాహరణనిచ్చారు.

ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఇస్తున్న హామీలపై అధికారుల పరిశీలన త్వరలోనే ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ప్రధానంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి వివిద పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలను పరిశీలించనున్నారు. హామీల అమలు నేరవేరుస్తామంటూ పార్టీలు ముందుగానే అఫిడెవిట్ లు సమర్పించాల్సి వుంటుందని చెప్పారు. మరీ అమలుచేయడానికి సాధ్యం కాని హామీలు ఇస్తున్నట్లు గుర్తిస్తే.. ఆ పార్టీ ఎన్నికల గుర్తును కూడా మార్చడం లాంటి కఠిన చర్యలు సైతం తీసుకోవాలని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles