మహిళా జర్నలిస్టుపై దాడి.. అక్రమ కేసులు.. ఇదేనా పాక్ సంస్కృతి..!? Pakistan FC trooper, female journalist, slaps, video goes viral

Pakistan fc trooper female journalist slaps video goes viral

Saima Kanwal, Pakistan,K 21 Channel, pak Tv Journalist, pak TV reporter slapped, pak journo slapped live, police slaps journalist, journalist assulted, Nadra registration office, karachi, pakistan

Saima Kanwal, anchor with K-21 channel in Pakistan was doing a live report on problems faced by citizens at Nadra registration office in Karachi, when a Frontier Constabulary (FC) trooper deployed as a guard slapped her.

ITEMVIDEOS: మహిళా జర్నలిస్టుపై దాడి.. అక్రమ కేసులు.. ఇదేనా పాక్ సంస్కృతి..!?

Posted: 10/21/2016 11:28 AM IST
Pakistan fc trooper female journalist slaps video goes viral

తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరని నానుడి అక్షరాల నిజమైంది. ఐక్యరాజ్య సమితికి హుటాహుటిని వెళ్లి..  జమ్మూకాశ్మీర్ లో భారత ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని పిర్యాదు చేసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీస్.. ముందుగా తన దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా సాగుతుందో చూసుకోవాలి. ఉగ్రవాదులకు స్వర్గధామంలో తయారైన పాకిస్థాన్ లో మహిళా జర్నలిస్టుల హక్కుల రక్షణకే దిక్కులేకుండా పోయింది. అడవారు అసలు చదువుకునేందుకే పనికిరారని అక్కడి సమాజం.. అందుకు వ్యతిరేకంగా ఉద్యమించిన బాలల హక్కుల ఉద్యమకర్త మలాలా యూసప్జాయ్ పై నిర్థాక్షిణ్యంగా కాల్పులకు తెగబడిన విషయాన్ని మర్చిపోయి.. సంస్కృతి సంప్రదాయం విషయంలో యావత్ ప్రపంచానికే అదర్శంగా నిలిచిన భారత్ పై పిర్యాదు చేస్తోంది.

తాజాగా కరాచీలో చోటుచేసుకున్న షాకింగ్ సంఘటన పాకిస్థాన్ లో మహిళల దయనీయ స్థితిని బయటపెడుతుంది. ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ మహిళా రిపోర్ట్పై పాకిస్తానీ పోలీసు గార్డు ఏకంగా చేయి చేసుకున్నాడు. ప్రజా సమస్యలను లైవ్ రిపోర్టు చేసే మహిళా జర్నలిస్టును పాక్ పోలీసు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. సైమా కన్వల్ అనే మహిళా యాంకర్ పాకిస్తాన్లోని కే-21 చానల్లో పనిచేస్తుంది. కరాచీలోని నాద్రా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లైవ్ రిపోర్టు చేయడానికి ఆమె అక్కడికి వచ్చింది.

అక్కడకు వచ్చే మహిళలతో అసభ్యంగా వ్యవహరిస్తున్న గార్డ్ పై పిర్యాదులు రావడంతో అమె అతన్ని నిగ్గదీసేందుకు కార్యాలయానికి వెళ్లింది. ముందుగా అమె అక్కడున్న మహిళలతో మాట్లడి వారి సమస్యలను తెలుసుకుంది. వారు అక్కడి గార్డ్ పై పిర్యాదు చేశారు. అయితే అమె అ గార్డుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే మహిళలపై నీచంగా ఎందుక వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. మీ ఇంట్లో అక్కా చెళ్లెల్లు లేరా..? అని నిలదీసింది.

దీంతో చిర్రెత్తుకోచ్చిన గార్డు ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. మొదట కెమెరామెన్ షూటింగ్ను ఆపడానికి ప్రయత్నించిన అతను, కన్వల్ కెమెరాను వేరేవైపు మరల్చడంతో అతను తప్పించుకున్నాడు. ఇక తాను వ్యవహారతీరుపై మండిపడ్డ జర్నలిస్టు నిలదీసింది. అమె నుంచి తప్పించుకోడానికి అతను వెళ్లిపోతుండగా అతడి చోక్కాను పట్టుకున్న జర్నలిస్టు.. అపి.. ఇది అతడి అరోగంట్ బిహేవియర్ అని చెప్పింది. అంతే అ లోపు గార్డు ఒక్కసారిగా తన చేయిని వెనక్కు లాగి ఆమెపై గట్టిగా చేయి చేసుకున్నాడు. ఆ మొత్తం సంఘటన చిత్రీకరణ అయిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
 
మహిళా రిపోర్టుపై దాడికి పాల్పడ్డ ఆ ఎఫ్సీ సైనికుడిపై గుల్బహార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేసినట్టు ఎస్ఎస్పీ సెంట్రల్ ముఖదాస్ హైదర్ పాకిస్తానీ మీడియాకు తెలిపారు. తాను కార్యాలయంలోకి వెళ్లి అధికారులను గానీ, సిబ్బంది విధులకు గానీ ఎలాంటి అవాంతరాలను కలింగించనని చెప్పడం కూడా వీడియోలో స్పష్టంగా వినిపించింది. అ తరువాత గార్డుతో పాటుగా అమె కార్యాలయం నుంచి బయటకు వస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది,

అయినా టీవీ చానల్ రిపోర్టర్ పై కూడా ఎఫ్ఐఆర్ను నాద్రా అధికారులు నమోదుచేశారు. ఆమె అధికారిక పనిలో అవాంతరాలు కలిగిస్తుందంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపాడు. మరోవైపు ఈ ఘటనను సోషల్ మీడియాలో తీవ్రంగా తప్పుబడుతున్నారు. నాద్రా ఆఫీసులో మహిళ జర్నలిస్టుపై చేయిచేసుకున్న ఆ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నెట్ జనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని, గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఎన్ఏ పాకిస్తాన్ సల్మాన్ ముజాహిద్ బ్లాచ్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saima Kanwal  pak Tv Journalist  Nadra registration office  karachi  pakistan  

Other Articles