మక్కా మసీదు కేసులో ట్విస్టు..మాట మార్చిన మంత్రి.. Jharkhand minister retracts statement in Mecca blast case

Jharkhand minister retracts statement in mecca blast case

new twist in mecca masjid case, new turn in mecca masjid case, mecca masjid bomb blast case, sunil joshi, devender gupta, Randhir Kumar Singh, Jharkhand minister, BJP minister, crime, national investigation team

n a significant development, a witness in the Mecca Masjid blast case did a U-turn and retracted his statement given earlier to CBI some time ago. He claimed the agency recoded his statement under duress.

మక్కా మసీదు కేసులో ట్విస్టు..మాట మార్చిన మంత్రి..

Posted: 10/21/2016 12:39 PM IST
Jharkhand minister retracts statement in mecca blast case

మక్కా మసీదు బాంబు పేలుడు కేసు కీలక మలుపు తిరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన కేసులో రాష్ట్రమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి మాటమార్చారు. నిబద్దతకు, నిజాయితీకీ నిలువుటద్దం లాంటి రాజకీయాలో ఉన్నత స్థాయితో కొనసాగుతున్న వ్యక్తి ఏకంగా తన మాటకు విలువ లేదని చెప్పకనే చెప్పేశాడు. తన మాటకే కట్టుబడని వ్యక్తి ప్రజల ప్రాణాలకు ఏమి విలువనిస్తాడు. ఆయన మరెవరో కాదు జార్ఖండ్ లోని అధికార బీజేపి తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రణధీర్ కుమార్ సింగ్. మక్కా మసీదు బాంబు పేలుడు కేసులో కీలక సాక్షిగా వున్న ఆయన ఏకంగా మాట మార్చి కేసులో ట్విస్టు పెట్టారు. కేసులో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన అయన న్యాయస్థానంలో తన వాంగ్మూలం ఇచ్చారు.

ఈ కేసులో కీలక నిందితుడైన సునీల్ జోషి ఎవరో తనకు తెలియదని కోర్టుకు తెలిపారు. సీబీఐ అధికారులు బలవంతపెట్టి గతంలో స్టేట్ మెంట్ తీసుకున్నారని చెప్పారు. దేవేందర్ గుప్తా అనే నిందితుడు ముస్లిం వ్యతిరేకి కాదని రణధీర్ తాజాగా పేర్కొన్నారు. మక్కా మసీదు కేసుకు పూర్వం అజ్మీర్ దర్గా కేసులో కూడా రణధీర్ ఇలానే మాట మార్చారు. కేసు దర్యాప్తు అధికారులకు ఒకలా వాంగ్మూలం ఇచ్చిన రణధీర్.. ఆ తరువాత న్యాయస్థానంలో మరోలా వాంగ్మూలం ఇస్తూ కేసును మలుపు తిప్పుతున్నారు.

2007 మే 18న మక్కామసీదులో బాంబు పేలడంతో 9 మంది మృతి చెందారు. 50 మందిపైగా గాయపడ్డారు. ఈ కేసులో జోషి, గుప్తాతో పాటు తొమ్మిది మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది. తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. 'సునీల్ జోషి, దేవేందర్ గుప్తా తనకు తెలుసునని రణధీర్ చెప్పినట్టు సీబీఐ మొదటి చార్జిషీటులో పేర్కొంది. వారిద్దరూ తనకు సన్నిహితులని, తనింటికి తరచూ వస్తుండేవారని తెలిపారని వెల్లడించింది. గుప్తా చాలా ఆవేశపరుడని, ముస్లింల పట్ల అతడికి వ్యతిరేకభావం ఉందని కూడా అన్నట్టు తెలిపింది. తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన రణధీర్ జోషి ఎవరో తనకు తెలియదని, స్టేట్ మెంట్ పై సీబీఐ బలవంతంగా తనతో సంతకాలు పెట్టించిందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mecca Masjid  bomb blast case  Randhir Kumar Singh  Jharkhand minister  BJP minister  nia  

Other Articles