నేను ‘సుప్రీం’కు రాను.. అదేశాలను తిరస్కరిస్తున్నా.. Former CJI Markandey Katju says want attend SC

This judicial system is beyond redemption says markandey katju

Markandey Katju, justice katju, markandey katju, soumya rape-cum-murder case, soumya murder case, kerala, supreme court, Sowmya rape case, Supreme Court, Supreme Court of India, katju

Justice (Retd) Markandey Katju is once again in the limelight after the Supreme Court summoned the former brother judge to explain his Facebook post

నేను ‘సుప్రీం’కు రాను.. అదేశాలను తిరస్కరిస్తున్నా..

Posted: 10/19/2016 10:32 AM IST
This judicial system is beyond redemption says markandey katju

దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్వయంగా హజరై తన ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తాను హాజరుకానని తేల్చిచెప్పారు. న్యాయస్థానం జారీ చేసిన అదేశాలను తాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ న్యాయమూర్తులు కోర్టులో హాజరు కావడాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124 (7) నిషేధిస్తోందని, దాని ప్రకారం కోర్టు ఆదేశాలను తిరస్కరిస్తున్నానని చెప్పారు.

సంచలనం సృష్టించిన కేరళ సౌమ్య రేప్, హత్య కేసులో సుప్రీం వెలువరించిన తీర్పులో ప్రాథమిక తప్పులున్నాయని మార్కండేయ కట్జూ సెప్టెంబర్‌లో తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పు ఇచ్చే ముందు జడ్జీలు సెక్షన్ 300ను క్షుణ్ణంగా పరిశీలించలేదని, ఈ కేసును బహిరంగ కోర్టులో పునర్విచారించాలని కట్జూ కామెంట్లు చేశారు. దీనిని అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించింది.

వీటిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థాన ద్విసభ్య న్యాయస్థానం.. అయనను తమ ఎందుట హాజరుకావాలని, స్వయంగా తాను చేసిన ఫేస్ బుక్ పోస్టు కామెంట్లపై వివరణ ఇవ్వాలని అదేశించిస్తూ సమన్లు జారీచేసింది. అయనను అసాధారణ రీతిలో దేశంలోనే తొలిసారిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిని తన ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీనిపై స్పందించిన కట్జూ, ‘నేను నా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి కోర్టుకు వచ్చి వాదించుకోవాలన్నది సుప్రీం ఆదేశాల సారం. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సుప్రీం కోర్టుకు తగదు’’ అని జస్టిస్‌ కట్జూ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ మరీ ముఖ్యంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై జస్టిస్‌ కట్జూ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ పూర్తిగా భూస్వామ్య లక్షణాలతో ఉందని, సమీప భవిష్యత్తులో ఇది మారే పరిస్థితి లేదని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

చాలామంది ప్రతిభ ఆధారంగా సుప్రీం కోర్టు జడ్జిలుగా నియమితులు కావడం లేదు. వివిధ హైకోర్టుల్లో చీఫ్‌ జస్టి్‌సల సీనియారిటీ ఆధారంగా వారిని ఎంపిక చేస్తున్నారని అరోపించారు. ఇంకా చెప్పాలంటే, భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కొలీజియం ఇష్టాయిష్టాలపై ఈ నియామకాలు జరుగుతున్నాయన్నది కాదనలేము’’ అని జస్టిస్‌ కట్జూ వ్యాఖ్యానించారు. ఇటువంటి తప్పుడు నియామకాలను పునః సమీక్షించాలని, ఇటువంటి భూస్వామ్య లక్షణాలు కలిగిన న్యాయమూర్తులు ధర్మాసనాల్లోకి రాకుండా అడ్డుకోవాలని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Markandey Katju  Sowmya rape case  Supreme Court  Supreme Court of India  

Other Articles