రాహుల్ ను కుక్క, గాడిద అనలేదు కదా! | Congress MLA suspended for remarks against Rahul Gandhi

Congress mla suspended for remarks against rahul gandhi

Rahul Gandhi Dog Donkey, Congress MLA suspended for remarks against Rahul , RK Rai Rahul Gandhi, RK Rai Ajith Jogi, Chattisgarh congress MLA

Congress MLA suspended for remarks against Rahul Gandhi.

రాహుల్ గాంధీని గాడిద అంటూ....

Posted: 10/19/2016 10:26 AM IST
Congress mla suspended for remarks against rahul gandhi

యువరాజు రాహుల్ గాంధీకి గడ్డుకాలం నడుస్తోంది. వారం క్రితం మధ్యప్రదేశ్ కి చెందిన ఓ కాంగ్రెస్ నేత రాహుల్ రాజకీయాలకు పనికి రాడంటూ ఓ వీడియోను సోనియాకు పంపిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాడంటూ ఓ ఎమ్మెల్యేను ఏకంగా సస్పెండ్ చేసింది ఛత్తీస్ గఢ్ పీసీసీ. అయితే తనపై వేటు వేయటం చాలా సంతోషకరమని అంటున్నాడు ఎమ్మెల్యే ఆర్ కే రాయ్.

‘పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నానని, ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడానని పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నేనేం గాడిదను గుర్రం అని సంభోదించలేదు. నేనేదో తప్పు చేసినట్లు అధిష్టానం నాపై గుడ్డిగా వేటు వేసిందంటూ’ ఓ ప్రకటనలో రాయ్ పేర్కొన్నాడు.

నేనేం బాధపడటం లేదు. ఎందుకంటే నేను నిజాలే మాట్లాడాను. ఇప్పుడు చాలా ఉపశమనంగా ఉంది. గిరిజనులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న స్కాంలను ఇక బయటపెట్టడమే నా ముందు ఉన్న పని అంటూ తెలిపాడు.

గతంలో పోలీసాఫీసర్ గా ఉన్న రాయ్ ను ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ జోగి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2013 లో గుంధేర్ది నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కూడా ఇప్పించాడు. కాంగ్రెస్ తో విభేధాలతో ప్రస్తుతం వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ జోగితో గత కొంత కాలంగా రాయ్ సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ మీటింగ్ పెట్టి మరీ సీపీసీసీ ఆయన్ను తొలగించింది. రెండు మూడు రోజుల్లో రాయ్ జనతా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress MLA  Chattisgarh  suspended  comments on Rahul  

Other Articles