సింధు, మురళీమోహన్ లకు పద్మ భూషణ్ పురస్కారాలు? | AP Govt recommend PV sindhu and Muralimohan names for Padma Bhushan.

Ap govt recommend pv sindhu name for padma bhushan

PV Sindhu Padmabhushan, Actor and MP Murali Mohan Padma bhushan, Padma bhushan puraskar for Murali Mohan, AP govt recommend names for Padma Puraskars 2016

AP Govt recommend PV sindhu and Muralimohan names for Padma Bhushan.

పీవీ సింధుకి ఆ గౌరవంపై అనుమానాలు!

Posted: 10/18/2016 02:22 PM IST
Ap govt recommend pv sindhu name for padma bhushan

రియో ఒలంపిక్స్ లో భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేస్తూ రజత పతకం సాధించిన పీవీ సింధుకు మరో అరుదైన పురస్కారం లభించబోతుందా? అంటే కాస్త అనుమానమనే చెప్పాలి. అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాల కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇందులో పద్మభూషణ్ కోసం సింధు పేరును కూడా జత చేసింది. గతేడాది పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న సింధు ఇప్పుడు పద్మ భూషణ్ పురస్కారం కోసం నామినేట్ కావటం విశేషం. అయితే పద్మ అవార్డుల నిబంధనల ప్రకారం ఒకదానికి మరోదానికి కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల గ్యాప్ ఉండాలి. ఈ నేపథ్యంలో అవార్డు కమిటీ ఆమె పేరును ఆమోదించడంపై కాస్త అనుమానాలే కలుగుతున్నాయి.

ఇక మరో క్రీడాకారుడు శ్రీకాంత్, టీడీపీ ఎంపీ, నటుడు మురళీమోహన్, ప్రముఖ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ గురవారెడ్డి, మృదంగం విద్వాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, నర్తకి ఆనంద్ శంకర్ జయంత్, ప్రముఖ డాక్టర్ సీకే దుర్గ పేర్లను కూడా ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసింది.

ఇక పద్మశ్రీ పురస్కారాల కోసం చేనేత రంగ ప్రముఖుడు రమణయ్య, ఈఎన్ టీ స్పెషలిస్ట్ విష్ణు స్వరూప్ రెడ్డి తదితరుల పేర్లను సిఫారసు చేసింది. ఈ పురస్కారాల కోసం మొత్తం 22 మంది ప్రముఖుల పేర్లను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సూచించింది. రిపబ్లిక్ డే నాడు పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles