చైనా ఉత్పత్తుల విక్రయాలపై సోషల్ మీడియా ప్రభావం Sales of Chinese goods decline 20

Sales of chinese goods decline 20 after social media campaign claims traders body

boycott Chinese products, CAIT, Chinese goods, Chinese lighting, Diwali, NSG, Praveen Khandelwal, Sales, Chinese goods, decline 20percent, social media campaign, claims, traders body

The social media campaign to boycott Chinese goods during Diwali has beaten down sentiment of retail traders as there has been a 20 percent decline in demand so far.

చైనా ఉత్పత్తుల విక్రయాలపై సోషల్ మీడియా ప్రభావం

Posted: 10/15/2016 06:05 PM IST
Sales of chinese goods decline 20 after social media campaign claims traders body

భారత్ పై ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించి.. హింస సృష్టించేందుకు శతవిధాల కుయుక్తులు పన్నుతూ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కు మద్దతు ప్రకటిస్తున్న చైనా.. మనపై విషం కక్కుతున్న నేపథ్యంలో అ దేశ ఉత్పత్తులను నిషేధించాలన్న ప్రచారం భారీగానే ప్రభావాన్ని చూపుతుంది. చైనా అండతో పాకిస్థాన్ తమ దేశంలోని ఉగ్రవాద సంస్థలను, వాటి నేతలను కాపాడుకుంటుంది. భారత్ మోస్ట్ వాంటెండ్ జాజితాలో వున్న వారిని, ఐక్యరాజ్య సమితిలో తనకున్న బలంతో చైనా అడ్డుకుంటుందని, ఈ నేపథ్యంలో చైనా వస్తువులను కొనుగోలు చేసిన మనం అదేశాన్ని అర్థికంగా అదుకోవండం అవసరమా అన్న ప్రచారం జోరందుకుంది.

దీంతో చైనీస్ వస్తువుల బహిష్కరించాలన్న సామాజిక మీడియా ప్రచారం రిటైల్ వ్యాపారులు సెంటిమెంట్ ను దెబ్బతీసిందని  ట్రేడర్స్ బాడీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వాడి వేడి చర్చల కారణంగా తమ   లైటింగ్  అండ్  డెకొరేటివ్ ఉత్పత్తుల అమ్మకాలపై భారీగా పడిందని కాన్ఫెడరేషన్ ఆఫ్  ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) వెల్లడించింది. ముఖ్యంగా దీపావళిసందర్భంగా  గృహాలను అలంకరించుకునే  తమ   ప్రొడక్ట్స్ అమ్మకాలు  దాదాపు 20 శాతం తగ్గిపోయాయని  ఈ సంస్థ  సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్  చెప్పారు.

చైనీస్ లైటింగ్,  దీపావళి అలంకరణ, ఇతర సామగ్రి  పండుగ సీజన్ మూడు నెలల ముందే  భారత మార్కెట్లో వెల్లువెత్తుతుందని   ప్రవీణ్ చెప్పారు. కానీ చైనా వస్తువుల నిషేధంపై  సామాజిక మీడియా లో తీవ్రస్థాయిలో నడుస్తున్న చర్చ తమ ఉత్పత్తులపై పడిందని తెలిపారు.  రానున్న దీపావళి పండుగ సందర్భంగా ఇప్పటికే భారీ సంఖ్యలో తో  రిటైల్ వ్యాపారులు వద్దకు చేరిన ఈ ఉత్పత్తుల విక్రయాలకు  డిమాండ్ 20 శాతం క్షీణించడంతో   ఇబ్బందుల్లో పడ్డారని  చెప్పారు. దీంతోపాటు అసలు అమ్ముడు పోతాయా? లేదా? అనే  భయాందోళనలు వారిలో నెలకొన్నాయని  పేర్కొన్నారు.
 
ఇప్పటికే  టోకు వ్యాపారుల నిల్వ చేసి వున్న ఈ వస్తువులు కాలక్రమంలో  అమ్ముడు పోవాలని ఆశిస్తున్నామని....లేదంటే  వ్యాపారులకు తీవ్ర నష్టాలు తప్పవనే ఆందోళనను ఆయన  వ్యక్తంచేశారు. కాగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) లోదేశం యొక్క సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, జెమ్ చీఫ్ మసూద్ అజహర్ పై అమెరికాలోనిషేధం నేపథ్యంలో   భారతదేశం లో చైనీస్ వస్తువుల బహిష్కరించాలని  సోషల్ మీడియా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం దీపావళి అలంకరణ విక్రయాలపైనే వ్యాపారులు  బావురుమంటోంటే.. మరి చైనా దీపావళి  టపాసులు, ఇతర బాణాసంచా  విక్రయాలపై ఇంకెంత భారం పడనుందో వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese goods  sales decline  20percent  social media campaign  traders  

Other Articles