పవన్ మళ్లీ వార్నింగ్ తోనే సరిపెట్టాడు | pawan kalyan press meet over Victims of Mega Aqua Food Park

Pawan kalyan press meet over victims of mega aqua food park

pawan kalyan press meet over Victims of Mega Aqua Food Park, Pawan Klayan West Godavari farmers, Pawan Kalyan Farmers meeting, Pawan Kalyan Mega Aqua Park, Pawan press meet on mega aqua park

pawan kalyan press meet over Victims of Mega Aqua Food Park .

ITEMVIDEOS:మొండిగా ముందుకు వెళ్తే రంగంలోకి దిగుతా - పవన్

Posted: 10/15/2016 05:39 PM IST
Pawan kalyan press meet over victims of mega aqua food park

ప్రశాంతతకు నెలవైన గ్రామాల్లో ఖాకీ బూట్ల చప్పుళ్లతో 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావట్లేదని నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. .పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వాఫుడ్ ప్రాజెక్టుపై నెలకొన్న వివాదంపై కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడాడు. ప్రతి రోజూ ఎవరో ఒకరు వచ్చి తనను కలుస్తున్నారని, వారు చెప్పేదంతా వింటూంటే చాలా ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. ఆధ్యాత్మికత పేరుతో ప్రపంచం మెచ్చేలా ప్రభుత్వం పుష్కరాలు జరిపిందని, అలాంటి పుష్కరాలకు ప్రతిబంధకంగా మారుతూ, నదిని కలుషితం చేయబోయే పరిశ్రమను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందని ఆయన అడిగారు.

నదీపాయల్లోకి ఎన్నో పరిశ్రమలు కాలుష్యం వదులుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎక్కడైనా పరిశ్రమలు పెడుతున్నప్పుడు ఆ భూములు పంటలకు అనువుగా లేని భూమి అని నిరూపించాల్సి ఉంటుందని, అయితే ఏ పరిశ్రమా ఆ నిబంధనలు పాటిస్తున్నట్టు కనిపించదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఫుడ్ పార్క్ పెట్టే వారు అక్రమానికి పాల్పడరని గ్యారెంటీ ఏంటని ఆయన అడిగారు. 'సీపీఎం మధు వంటి నేతలు వెళ్లినప్పుడు వారిని నిర్బంధించారు. అది సరైన పద్దతేనా?' అని ఆయన నిలదీశారు. ఈ ఫుడ్ పార్క్ విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే.. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నందిగ్రామ్ ఘటన ఏపీలో పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.


వాస్తవానికి తాను అక్కడికే వెళ్దామనుకున్నానని, అయితే తాను వెళ్తే ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని భావించి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఇలాంటి సమస్య ఆస్ట్రేలియాలో వస్తే అక్కడ కేవలం కాలుష్య సమస్యగా మారిందని, కానీ మన దేశంలో ఇలాంటి సమస్య కుల పోరాటంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆక్వాఫుడ్ ప్రాజెక్టును సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లండి అని అడుగుతున్నారు. అలా చేయడం వల్ల ఇబ్బంది ఉంటే ఓ కమిటీని వేసి, ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండని ఆయన సూచించారు.

ఆ గ్రామాల ప్రజలకు న్యాయం చేయండి అని ముఖ్యమంత్రికి సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పశ్చిమగోదావరి జిల్లా అన్నది గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీ గంగా ప్రక్షాళన అంటుంటే...ఇక్కడి బీజేపీ నేతలు గోదావరి కాలుష్యానికి పాల్పడడం సరికాదని ఆయన తెలిపారు. ప్రభుత్వం మొండివైఖరి అనుసరిస్తే.. ప్రజల పక్షాన నిలబడతానని ఆయన స్పష్టం చేశారు.

పవనే దిక్కని వచ్చాం...

అంతకు ముందు నరసాపురం ప్రాంతానికి చెందిన పలువురు రైతులు పవన్ కల్యాణ్ ను కలిశారు. కుంతేరు కాలువపై ఆధారపడి 2 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని మీడియాకు వివరించారు. ఆక్వాఫుడ్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని వారు ఆరోపించారు. రైతుల సంతకాల ఫోర్జరీ చేసి, పరిశ్రమకు గ్రామీణులు అనుకూలమని ప్రభుత్వం ప్రకటించిందని వారు విమర్శించారు. ఆ తరువాత తాము అభ్యంతరం చెప్పడంతో యువకులపై పెద్దపెద్ద సెక్షన్లతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, రైతులు అన్ని పార్టీల నేతల వద్దకు తిరిగినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఫుడ్ పరిశ్రమ వల్ల కుంతేరు కాల్వ విషతుల్యమైపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తమకు అండగా నిలబడతారన్న ఆశతో వచ్చామని వారు తెలిపారు. బహిర్భూమికి వెళ్లే వ్యక్తి దగ్గర ఆధార్ కార్డు లేకపోతే అరెస్టు చేసే పరిస్థితులు తమ గ్రామాలలో నెలకొన్నాయని రైతులు పేర్కొన్నారు. ఆక్వాఫుడ్ పరిశ్రమ ద్వారా రోజూ 2 లక్షల వ్యర్థాలు కుంతేరు కాల్వలో కలుస్తాయని, దీన్ని వ్యతిరేకిస్తూ తాము ఆందోళన చేస్తున్నామని, తమ ఆందోళనలను లెక్కచేయకుండా 144 సెక్షన్ ను అమలు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామంలోని రైతులు, మత్స్యకారులు, మహిళలు, విద్యార్థులు, పిల్లలు అని తేడా లేకుండా ఒక్కొక్కరిపై ఏడు కేసులు చొప్పున ఉన్నాయని ఆ గ్రామానికి చెందిన రైతులు, విశ్వమానవ వేదిక ప్రతినిధులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mega aqua park  pawan kalyan  pressmeet  

Other Articles