రోహిత్ దళితుడు కాదు.. పర్సనల్ కారణంతోనే సూసైడ్. ఇరానీ, దత్తాత్రేయలకు సంబంధం లేదు | Rohit Vemula not dalit and killed himself due to personal frustrations

Rohit vemula not dalit and killed himself due to personal frustrations

AK Roopanwal Commission on Rohit Vemula's suicide, Rohit Vemula's suicide report, Govt Panel on Rohit Vemula's suicide, Rohit Vemula Roopanwal Commission report, Rohit Vemula mother cheated with Fake caste, HCU student suicide case, clean chit to Dattatreya and Irani in Rohit Suicide

AK Roopanwal Commission, report on Rohit Vemula's suicide. He was not dalit and killed himself due to personal frustrations, Rohith Vemula's mother faked Dalit status, alleges probe.

ఫ్రస్టేషన్ తోనే రోహిత్ సూసైడ్ చేసుకున్నాడు

Posted: 10/06/2016 05:42 PM IST
Rohit vemula not dalit and killed himself due to personal frustrations

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చుకుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్. అంతేకాదు అసలు వేముల రోహిత్ దళితుడు అనేందుకు ఆధారాలు లేవని, సందేహాలు వ్యక్తం చేస్తూ... కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదిక సమర్పించింది.

వేముల రోహిత్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా హెచ్ఆర్డీ (మానవ వనరుల) మంత్రిత్వ శాఖ నియమించిన రిటైర్డ్ జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలోని కమిషన్ పేర్కొంది. నివేదికలో ఉన్న సమాచారం ప్రకారం రోహిత్ అతడు దళితుడు కాదని, అతని తల్లి రాధిక మాల కమ్యూనిటికి చెందిన ఆధారాలు లేవని చెప్పిందని తెలుస్తోంది. వేముల రోహిత్ తల్లి రాధిక తన పూర్వీకుల గురించి చెప్పకపోవటం పలు అనుమానాలకు తావిస్తుందని కమిషన్ తెలిపింది. మరోవైపు ఆమె తన బయోలాజికల్ పేరెంట్స్ క్యాస్ట్ చెప్పి ఉంటుందన్నారు.

ఇక ఈ నివేదికలో స్మృతి ఇరానీకి, దత్తాత్రేయకు క్లీన్ చిట్ ఇచ్చారు. అంతేకాదు, యూనివర్సిటీ అధికారులకు కూడా క్లిన్ చిట్ ఇచ్చింది. యూనివర్సిటీ రాజకీయ ఒత్తిడి లేకుండా సాగుతోందని పేర్కొన్నారు. అంతేకాదు రోహిత్ ఆత్మహత్య పైన కేంద్రీయ విశ్వవిద్యాలయ వీసీని కూడా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన పాత్రపై ఎటువంటి సమాచారం అందులో పొందుపరచలేదు.

కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని ఆత్మహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పలువురు రాజకీయ నాయకులు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వచ్చి ఆందోళనలకు మద్దతు పలికారు. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు వచ్చారు. వారంతా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను టార్గెట్ చేసారు. రోహిత్ వేముల వారి పేర్లు రాసి చనిపోయారని ఓ సూసైడ్ నోట్ ఉందని చెప్పి ఆ మంత్రులను టార్గెట్ చేయగా, తాజాగా కమిషన్ నివేదికతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Vemula  Suicide  AK Roopanwal Commission report  

Other Articles