సర్జికల్ దాడి అంతా ఉత్తదే అనేందుకు అనుమానాలు ఇవిగో... | UN suspects on Indian Surgical Strike on Pak

Un suspects on indian surgical strike on pak

India need to release surgical strike video, UN suspects on Indian Surgical Strike, Indian Surgical Strike Video demand, kejriwal hero in Pak, surgical strike video

UN too suspects on Indian Surgical Strike on Pak, release video footage.

సర్జికల్ దాడి అసలు జరిగిందా?

Posted: 10/04/2016 05:25 PM IST
Un suspects on indian surgical strike on pak

యూరి ఉగ్ర దాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ చోచ్చుకుపోయిన భారత సైన్యం ఏకంగా 38 మంది ఉగ్రవాదులను హతమార్చి క్షేమంగా తిరిగి రావడంపై మిగతా దేశాలన్నీ భారత్ కి మద్ధతు ప్రకటిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని సహించాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని భారత్ చాలా గట్టిగా ఇచ్చిందని అగ్ర రాజ్యం అమెరికాతో సహా పొరుగుదేశాలన్నీ ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సర్జికల్ దాడి అనేది అంతా కట్టు కథేనా? అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

దేశంలోని సొంత నేతలే కాదు.. ఐరాస వ్యక్తపరుస్తున్న సందేహాలను నిశితంగా పరిశీలిస్తే, ఈ అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి. విషయం ఏంటంటే... సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సైనిక బృందాన్ని (యూఎన్ఎంజీఐపీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సరిహద్దులో పర్యవేక్షిస్తున్న ఈ బృందానికి సర్జికల్ దాడిపై కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటి ఏకంగా 38 మంది ఉగ్రవాదులు మరణిస్తే, మిగతా ఉగ్ర బృందాల్లో ఎడతెగని చర్చ జరుగుతుంది. కానీ, ఇంతవరకు సంభాషణలను, సందేశాలను ఇచ్చి పుచ్చుకున్నట్టు దాఖలాలు కనిపించడం లేదు. ఇక రెండోది వారు చర్చలు జరపకుండా ఐఎస్ఐ నిలువరించి వుండవచ్చని, లేకుంటే ఒకరిద్దరు ఉగ్రవాదుల్ని చంపి భారత్ ఆ సంఖ్యను పెంచి చెప్పుండాలని భావిస్తోంది. ఇక మూడోది 38 మంది మృతదేహాలు, వాటి అంత్యక్రియల విషయం ఎంత దాచాలన్నా దాగే అంశం కాదు. వీటిని తరలించడం సమీప గ్రామాల్లోని ప్రజల కంటపడే తీరుతుందన్నది మరో వాదన.

ఐరాస కూడా అనుమానాలు లేవనెత్తున్న నేపథ్యంలో భారత్ నిజంగా సర్జికల్ దాడులు జరిపివుంటే, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన వీడియో ఫుటేజ్ ని వెంటనే విడుదల చేయాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ పెరుగుతోంది. వాస్తవానికి కార్గిల్ లోకి పాక్ సైనికులు చొచ్చుకు వచ్చిన వేళ, తొలుత ఆ దేశం తామాపని చేయలేదని బుకాయించింది. ఆ సమయంలో పాక్ జనరల్ గా ఉన్న ముషారఫ్, అప్పటి పాక్ సైన్యం ప్రధానాధికారి మొహమ్మద్ అజీజ్ మధ్య సంభాషణను ట్రాప్ చేసిన భారత 'రా' అధికారులు దాన్ని బహిర్గతం చేసి పాక్ కుట్రను ప్రపంచానికి చూపారు.

ఇప్పుడు కూడా తమ దేశంపై దాడి జరగలేదని పదే పదే చెబుతున్న పాక్ కు అంతర్జాతీయ దేశాల నుంచి మద్దతు పెరగక ముందే, ఆ దేశాన్ని మరింత ఏకాకిని చేయాలంటే సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించిన ఫుటేజ్ ని వెంటనే బయటపెట్టాల్సి వుంది. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందేనన్న సంకేతాలు పంపించారు. సొంత దేశంలో కూడా వ్యతిరేకత రావటం, అది రాజకీయ అంశంగా మారటం చిక్కుల్లో పడేసే అంశంగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సాక్ష్యాలు బయట పెట్టడంలో మరింత ఆలస్యం అయ్యే కొద్దీ అది ఇండియాకే నష్టమని రాజకీయ నిపుణులు సైతం వారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Surgical strike  Pakistan  video  UN  

Other Articles