రెండో టెస్టులో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. kiwis bowled out at 204 runs in first innings

Black caps bowled out in first innings against india

ind vs nzl second test, Eden Garden, new zealand, bhuvaneshwar kumar, mohammad shami, wriddhiman saha, Team India, virat kiohli, anil kumble, cricket, cricket news, India, India vs New Zealand 2016, Martin Guptill, new zealand, sports news, sports

New Zealand's hopes in the second Test with some inspired fast bowling after India wrapped up the touring side's first innings for 204 for a handy lead on the third day at Eden Gardens.

రెండో టెస్టులో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా..

Posted: 10/02/2016 10:56 AM IST
Black caps bowled out in first innings against india

కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేస్ బౌలర్ల ధాటికి పర్యటక జట్టు న్యూజీలాండ్ మూడో రోజు తొలి సెషన్ లోనే అలౌట్ అయ్యింది. 317 పరుగులను సాధించే క్రమంలో టీమిండియా బౌలర్ల ముందు కివీస్ మోకరిల్లారు. దీంతో 204 పరుగులకు అంతా పెవీలియన్ కు చేరకున్నారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులకు ఆలౌట్ కావడంతో టీమిండియాకు 112 పరుగుల ఆధిక్యం లభించింది. 128/7ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం ఇన్నింగ్స్ ను కొనసాగించిన న్యూజిలాండ్ మరో 76 పరుగులు చేసింది.

మూడో రోజు ఆటలో ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ జీతన్ పటేల్(47;47 బంతుల్లో 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అతనికి మరో ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ వాట్లింగ్(25) చక్కటి సహకారం అందించడంతో కివీస్ రెండొందల మార్కును దాటగల్గింది. ఈ జోడి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం జీతన్ పటేల్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. ఆపై వాట్లింగ్, వాగ్నర్ లను  షమీ అవుట్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు సాధించగా,షమీ మూడు, జడేజా, అశ్విన్లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో  316 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles