జనసేనాని పవన్ పై రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు.. Lions stray into residential area in Gujarat's Junagadh

Two lions stroll junagadh streets video went viral

lions on road, lions walking on road video, video lions on road, junagadh district lions spotted, lions spotted in junagadh district, gir national park, gir national park lions, trending video, viral video

In the video taken from a mobile phone, two lions are seen walking through an unlit path in Junagadh district of Gujarat.

ITEMVIDEOS: వైరల్: జనారణ్యంలో ఠీవీగా సంచరిస్తున్న మృగరాజులు

Posted: 10/02/2016 04:33 PM IST
Two lions stroll junagadh streets video went viral

కాకులు దూరని కారడవికి రారాజుగా వెలుగోందే మృగరాజులు కాంక్రీట్ జంగిల్ లో సంచరిస్తుంటే ప్రజలు ఏంచేస్తారు..? ఎప్పుడు ఎవరిపై దాడి దిగుతుందో,, ఎవరి ఆహారంగా చేసుకుంటుందో, తమ పశుసంపదపై పడుతుందేమోనని అనునిత్యం భయాందోళనకు గురవుతారు. అసలు అడవికి రాజైన సింహాలు గ్రామాల బాట పట్టి తిరగడానికి అడవిలో వాటికి అహారం లభించకో లేక మరో కారణమో తెలియదు కానీ.. ఎవరూలేని ఓ నిర్మానుష్య రాత్రి.. వీధుల్లో ఓ సింహం అకలితో అరుస్తూ.. ఎక్కడ అహారం లభిస్తుందోనని అన్వేషిస్తూ గ్రామమంతా కలియదిరుగుతుంది. అయితే ఆ సింహం గ్రామంలో కలియదిరుగుతూ వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో సింహం ఒకటి జనావాసాల్లోకి ప్రవేశించింది. అయితే, రాత్రి సమయం కావడంతో జనాల కంట్లో అది పడలేదు. గాఢనిద్రలో అందరూ నిద్రిస్తున్న సమయంలో అది వీధుల్లో ఠీవీగా సంచరించింది. ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా సింహం కంటపడకుండా అది సంచరిస్తున్న దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. అతను సోషల్‌ మీడియాలో పోస్టుచేసిన ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. జునాగఢ్‌ ప్రాంతం గిర్‌ అడవి జాతీయ పార్కుకు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరువలో ఉంటుంది. ఇక్కడ ఆసియా సింహాలు అధికంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు జనావాసాల్లో ఇలా సంచరించడం కూడా ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే! 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lions  gujarat villages  gir national park  junagadh district  gujarat  

Other Articles