భారత్ దెబ్బకు దిగొచ్చింది.. సార్క్ సదస్సును వాయిదా వేసింది Pakistan Postpones SAARC Summit

Pakistan postpones saarc summit

saarc, saarc summit, paksitan saarc summit, saarc summit postponed, saarc summit islamabad, saarc news, india saarc summit, Prime Minister Narendra Modi, Saarc Summit, Pakistan Prime Minister Nawaz Sharif, Pakistan Postpones SAARC Summit, pakistan news, world news

Pakistan postponed the SAARC Summit to be held here in November after five member states of the grouping decided against attending the meet

భారత్ దెబ్బకు దిగొచ్చింది.. సార్క్ సదస్సును వాయిదా వేసింది

Posted: 10/01/2016 10:03 AM IST
Pakistan postpones saarc summit

నీతి. నిజాయితీ, అంకితభావం, సమరస్య పూర్వక వాతావరణంతో వ్యవహరించే భారత్ సంయమనాన్ని, అచరిసస్తున్న ధర్మాన్ని కూడా దెబ్బతీసేందుకు ప్రయత్నించిన దాయధి పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించింది. ఒకపైవు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే.. పైకి మాత్రం కల్లబోల్లి మాటలు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్త దేశాల మద్దతను కూడగట్టుకునేందుకు యత్నించింది. ఏకంగా భారత్ పై ఐక్యరాజ్యసమితిలో పిర్యాదు చేసి కూడా వచ్చింది. అయినా ధర్మాబద్దంగా వ్యవహరించే భారత్ తన సంయమనాన్ని పాటిస్తూ వచ్చింది. పాకిస్థాన్ చేస్తున్న దాడులను ధీటుగా ఎదుర్కోంటూనే దాయాధి దేశానికి గుణపాఠం చెప్పాలని భావించింది.

స్కార్ దేశాల సదస్సులో భాగంగా పాకిస్థాన్ ఇక దక్షినాధి అసియా దేశాలకు కూడా కలుపుకుని ఇండియాను ఒంటరి చేయాలన్న ప్రయత్నాలు చేసింది. అంతే భారత్ కొట్టిన దెబ్బతో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది. యూరీ సెక్టార్ పై ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే రంగంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ సదస్సుకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. ఆ వెంటనే భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు తాము కూడా భారత్ వెంటే ఉన్నామని, పాకిస్థాన్‌ తక్షణం ఉగ్రవాద అనుకూల చర్యలు మానుకోవాలని, ఉగ్రవాదాన్ని అరికట్టేదిశగా కదలాలని సూచిస్తూ సార్క్ సదస్సుకు రామని తేల్చిచెప్పాయి. ఎట్టకేలకు శ్రీలంక, మాల్దీవులు కూడా భారత్ వెంటే ఉన్నామన్న సంకేతాలు ఇస్తూ, సార్క్ సదస్సుకు రాలేమని పాకిస్థాన్ కు తెలిపాయి.

చైనాకు మద్దతు పలుకుతున్న శ్రీలంక కూడా సార్క్ సమావేశాలకు రామని చెప్పడంతో తీవ్ర ఆలోచనలో పడిన పాకిస్థాన్ సార్క్ సమావేశాలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సు ఎప్పుడు నిర్వహించనున్నదీ త్వరలో వెల్లడించనున్నామని పాక్‌ అధికారులు ప్రకటించారు. కాగా, ఇస్లామాబాద్‌ లో నవంబర్ 9, 10వ తేదీల్లో 19వ సార్క్‌ శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. దీంతో ఈ సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ తో పాటు ప్రస్తుతం దీనికి నేతృత్వం వహిస్తున్న నేపాల్ సిద్ధంగా ఉంది. సభ్యదేశాలు హాజరకాలేమని తెలిపిన నేపథ్యంలో సార్క్ సమావేశాలు వాయిదా పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles