సరిహద్దులో మళ్లీ టెన్షన్... పాక్ కాల్పులు | Pakistan violates ceasefire firing at Akhnoor district

Pakistan violates ceasefire firing at akhnoor district

Pakistan violates ceasefire, Pak fire at Akhnoor, No casualities in Akhnoor Fire, Akhnoor Encounter, Akhnoor Pak, India Pak war at Akhnoor, Pak Ceasefire in september 2016

Pakistan violates ceasefire firing at Akhnoor district.

మరోసారి కాల్పులకు దిగిన పాక్

Posted: 10/01/2016 11:05 AM IST
Pakistan violates ceasefire firing at akhnoor district

పాక్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో నెల‌కొన్న ఆందోళ‌నక‌ర ప‌రిస్థితుల‌పై ప్ర‌పంచంలోని అనేక దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న‌ వేళ పాక్ మ‌రోసారి రెచ్చిపోయింది. పాక్ బ‌ల‌గాలు ఈరోజు ఉద‌యం మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాయి.

జమ్ముకశ్మీర్ అఖ్నూర్ సెక్టార్‌లోని చప్రియల్‌, సమ్వాన్‌ ప్రాంతాల్లో శుక్రవారం పాక్ బ‌ల‌గాలు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈరోజు తెల్ల‌వారు జామున‌ కూడా మ‌ళ్లీ అదేప్రాంతంలో బుల్లెట్ల వ‌ర్షం కురిపించింది పాక్‌. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి హానీ జ‌ర‌గ‌లేదని, అఖ్నూర్ సెక్టార్‌లో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని ఆర్మీ అధికారులు మీడియాకు తెలిపారు. గడిచిన 36 గంటల్లో మూడోసారి పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

కాగా, గత ఏడాది కాలంగా పాక్ దుశ్చర్యల కారణంగా 16 మంది సాధారణ పౌరులు బలికాగా, 71 మందికి గాయాలయ్యాయి. ఈ తరహా కాల్పుల ఘటనలు మొత్తం 405 జరిగాయని ఓ అధికారి వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Pakistan  Ceasefire  Fire  

Other Articles