కోటలో దెయ్యం.. ఎప్పటి నుంచో భయం... | real ghost at Oxburgh Hall goes viral

Real ghost at oxburgh hall goes viral

Spanish woman appears as ghost, Oxburgh Hall real Ghost pic, 500 years ago missing now ghost, Missing woman turns as ghost, Ghost Pic at fort

Spanish woman appears as ghost who missed along 500 years ago in Oxburgh Hall.

500 ఏళ్ల క్రితం మిస్సయి... ఇప్పుడు దెయ్యంగా??

Posted: 09/22/2016 11:00 AM IST
Real ghost at oxburgh hall goes viral

షరా మాములే... దెయ్యాలు ఉన్నాయా లేదా? అన్న డిస్కషన్ మరోసారి తెరపైకి వచ్చింది. కాకపోతే ఈసారి టెక్నాలజీ అత్యున్నత స్థాయిలో ఉన్న యూకే లో ఓ రియల్ ఘోస్ట్ ఫోటో ఇప్పుడు సంచలనంగా మారటమే ఇందుకు కారణం. నార్ ఫోక్ లోని ఆక్స్‌బర్గ్ హాల్‌ కోటలో సుమారు 500 ఏళ్ల క్రితం తప్పిపోయిందనుకుంటున్న ఓ మహిళ దెయ్యంగా తిరుగుతోందట. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్లో దర్శనమిస్తోంది.

1482 నుంచి యూకే జాతీయ సంపదగా ఉన్న ఆక్స్‌బర్గ్ హాల్‌లో క్రిస్టియన్ మతపెద్దలకు ఆతిథ్యం ఇస్తూ వస్తున్నారు. ఆ కాలంలోనే సుమారు పాతికేళ్ల ఓ స్పానిష్ యువతి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. మిస్సయిన సమయంలో ఆ యువతి గర్భవతిగా ఉందని, పెళ్లి కాకుండానే ఆమె గర్భవతి కావటానికి కోటలోని ఒకరు కారణమని, వారే ఆమెను చంపేసి ఉంటారని ఓ పుకారు ఉంది. అప్పటి నుంచి ఆ యువతి అక్కడ దెయ్యంగా మారి తిరుగుతుందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.

Real Ghost Pic

Ghost in Fort

తాజాగా 46 ఏళ్ల వయసున్న "డయానా బెరోన్" అనే మహిళ తన ఫ్యామిలీతో కోటను దర్శించేందుకు వెళ్లింది. అక్కడ తన వారిని దూరం నుంచి ఫోటో తీస్తుండగా, అందులో ఓ మహిళ కూడా పడింది. జుట్టు విరబూసుకుని, మొహం నల్ల రంగులో కనబడుతోంది. గోడకు ఆనుకుని నిలుచున్నట్లు కనిపిస్తోంది. దీంతో కోటలో దెయ్యం అనే వార్తను కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు కొందరు. ఇంకొందరైతే సుమారు 23 ఏళ్ల వయసున్న ఓ గర్భవతి యువతి తరుచూ కోట సమీపంలో కనిపించడం చూశామని, అయితే అందమైన ఆ యువతి సడన్ గా మాయమ్యేదని చెబుతున్నారు. అయితే అదంతా పుకార్లని, ఫోటో కూడా ఎడిట్ చేసిందని, పని కూడగట్టుకుని కొందరు ఆ పని చేసి ఉంటారని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oxburgh Hall  real Ghost  photo  

Other Articles