జమ్ముకశ్మీర్ లోని యూరి సెక్టార్ పై ఉగ్రపంజా దాటికి 17 మంది జవాన్లు మృత్యువాత పడగా, తాజాగా క్షతగాత్రుల్లో మరో ముగ్గురు చనిపోవటంతో ఆ సంఖ్య 20కి చేరింది. ఆదివారం వేకువఝాము నుంచి ప్రారంభమైన ఈ మారణకాండ మూడు గంటల పాటు హోరాహోరీగా సాగింది. సైన్యం జరిపిన ప్రతిదాడిలో నలుగురు ఉగ్రవాదులు మట్టికరిచారు. నియంత్రణ రేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న యూరి ప్రాంతంలో గ్రెనేడ్లు విసురుతూ, తుపాకులతో విచక్షణ రహితంగా కాలుస్తూ నలుగురు నాలుగు దిక్కులా వెళ్లారు. గ్రెనేడ్లు విసరడంతో టెంట్లకు నిప్పంటుకుంది. మంటలు సమీపంలోని బ్యారక్‌లకు కూడా వ్యాపించాయి. ముష్కరుల కాల్పుల కంటే మంటల్లో చిక్కుకొనే ఎక్కువ మంది సైనికులు మరణించారు.
కాగా, దాడులు జరిగే అవకాశముందని గతంలోనే తాము హెచ్చరించామని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. సెప్టెంబరు 15వ తేదీ నాడు తాము ఈ హెచ్చరికలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు పాక్ సరిహద్దుల్లో ఆగస్టు 28 నుంచే రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశామని తెలిపాయి. ఏడుగురు సాయుధులైన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) నుంచి భారత్ లోని యూరి సెక్టార్ ప్రాంతంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించామని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
అసలేం జరిగింది?
ఆదివారం ఉదయం సరిహద్దు ప్రాంతంలోని యూరి రిజిమెంట్ లోకి చోరబడ్డారు. వేకువజాము కావడంతో కొందరు సైనికులు ఇంకా టెంట్ల కింద నిద్రిస్తున్నారు. ఇదే సమయంలో స్థావరం వెనుకభాగంలో ఫెన్సింగ్ వైర్లను కత్తిరించి క్యాంపులోకి ప్రవేశించారు. మూడు గంటలపాటు ముష్కరులు-సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. బాంబుల మోత, కాల్పుల శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉదయం 8.30 గంటలకల్లా నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. చనిపోయిన 17 మంది జవాన్లు డోగ్రా రెజిమెంట్‌కు చెందినవారే. మిగతా ముగ్గురి గురించి వివరాలు తెలియరాలేదు. మరో 20 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా 70 కి.మీ. దూరంలో ఉన్న శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ ముగిసిన అనంతరం 12 బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ సహా ఆర్మీ ఆ ప్రాంతమంతా జల్లడపట్టింది. కాగా, పాక్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బలగాలు భావిస్తున్నాయి. ఆయుధాలపై పాక్ గుర్తులు ఉండటం దీనిని ధృవీకరిస్తోంది. కాగా, గత 25 ఏళ్లలో కశ్మీర్‌లో మన సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని భారత సైన్యం చెబుతోంది..
ఈ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపందల చర్య అని, దాడికి పాల్పడ్డవారిని వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేరుగా పాక్ పేరును ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు.యూరీ ఘటనలో 17 మంది భారత వీర జవాన్ల ప్రాణత్యాగాన్ని వృథా కానివ్వబోమని, పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు, వారి వెనకుండి ప్రోత్సహించిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పారికర్ వ్యాఖ్యానించారు.
అయితే ఇంతజరుగుతున్నా ఆదేశం తో శాంతియుత వాతావరణం కొనసాగించాల్సిన అవసరం ఏముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదులకు సాయమందిస్తున్న పాక్‌ను ఏకాకిని చేయాలంటూ వారు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
పాకిస్థాన్ ఉగ్రవాద దాడులపై రగిలిపోతున్న ఓ జవాను తన వాహనంలో నిలబడి చేసిన అనర్గళ ప్రసంగం, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'షేర్ కిసీసే డర్ తే నహీ' (పులి ఎవరికీ భయపడదు) అంటూ మొదలైన ఆ ప్రసంగంలో పాకిస్థాన్ వైఖరిని ఎండగడుతూ, కవిత్వం చెప్పిన ఆ సైనికుడికి యువత జేజేలు పలుకుతూ, సామాజిక మాధ్యమాల్లో షేర్ మీద షేర్ చేసుకుంటున్నారు. పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ, ఇలాంటి దాడులకు భారత్ భయపడదని, దేశ ప్రజలకు భరోసా ఇచ్చాడు. అతనేం చెప్పాడంటే...
పులి ఎవరికీ భయపడదు
వెళ్లి పాకిస్థాన్ కు చెప్పండి
మేము భయపడం అణు బాంబులకు
మేము భయపడం బాంబు పేలుళ్లకు
మేము భయపడం దాడులకు
భయపెట్టాలని చూసే వారికే భయాన్ని పుట్టిస్తాం
భారతావని గడ్డపై మేము తాగే నీటి శక్తి తెలియజేస్తాం
అదృష్టవశాత్తూ నాటి యుద్ధంలో బతికారు
ఆనాటి యుద్ధాలను గుర్తు చేసుకోండి
కార్గిల్ యుద్ధంలో ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకోండి
పాకిస్థాన్... చెవులు తెరచుకొని విను
మేము గురి పెడితే ఏంజరుగుతుందో తెలుసుకో
మీ ఆటలు సాగనివ్వం
పాకిస్థాన్ ఇప్పటికే చేసింది ఎక్కువైందని, ఇకనైనా తమ భూభాగంపై ఉన్న ఉగ్రవాదుల ఆగడాలను అడ్డుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. తాము తిరగబడితే వచ్చే మహా ప్రళయంలో పాక్ మట్టికొట్టుకుపోతుందని తెలిపాడు. ఇందులో ఎటువంటి అనుమానాలూ లేవని స్పష్టంగా చెప్పిన ఆ జవాన్ ఎవరన్నది మాత్రం ఈ వీడియోలో తెలియనప్పటికీ, అతని ఉద్వేగ ప్రసంగం మాత్రం వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more