సెప్టెంబర్ 12 కర్ణాటకలో కావేరి చిచ్చు దెబ్బకి రాష్ట్రం మొత్తం గజగజ వణికిపోయింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు పెను విధ్వంసమే సృష్టించారు. వారి ఆగ్రహ జ్వాలల్లో సుమారు 42 బస్సులు మాడిమసైపోయాయి. అయితే ఆ గొడవలు చల్లారక దానికి కారకులుగా భావిస్తున్న దాదాపు 400 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక పాతికేళ్ల యువతి కూడా ఉంది. ఆమె పేరు సి.భాగ్య, కూలీ పనులు చేసుకునే యువతి. మరి అలాంటి యువతికి నిజంగా కావేరి సెంటిమెంట్ ఉందా? అసలు ఆమె ఆందోళనల్లో ఎందుకు పాల్గొంది? తెలిస్తే మాత్రం నిజంగా షాకవుతారు.
కేవలం ప్లేట్ బిర్యానీ, రూ. 100 కోసం ఆమె ఈ పెను విధ్వంసంలో భాగస్వామిగా మారిందట. కేపీఎన్ బస్ గ్యారేజ్ కి సమీపంలోని గిరినగర్ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న భాగ్య కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే తన కూతురికి ఏ పాపం తెలీదని, కొందరు మభ్యపెట్టి తీసుకెళ్లారని చెబుతోంది భాగ్య తల్లి ఎల్లమ్మ. ఆరోజు భాగ్య అప్పుడే పని నుంచి ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో కొంతమంది వచ్చి ఆమెకు బిర్యానీ పెట్టించారు. ఆపై వంద రూపాయలు ఇచ్చి నిరసనల్లో పాల్గొనేందుకు తీసుకెళ్లారు అని వివరించింది.
ఇక దాడులకు సంబంధించిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు అందులో పాల్గొన్న వారిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. భాగ్యతోపాటు మరికొంత మంది మహిళలు పాల్గొన్నట్లు తెలుస్తున్నప్పటికీ అందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు మాత్రం దొరకలేదు. బస్సు డిపోపై దాడికి వెళ్లిన భాగ్య, తనతో వచ్చిన వారిని రెచ్చగొట్టినట్టు కేపీఎన్ ఉద్యోగులు తీసిన మొబైల్ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అడ్డుకోవాలని వారు ప్రయత్నించగా, వారిపై డీజిల్ పోసి కాల్చేస్తామని బెదిరించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఇక నిరసనకారులకు డబ్బిచ్చి దాడులకు పుసిగొల్పినట్లు తెలుస్తుండటంతో, దీనివెనుక భారీ కుట్రదాగుందన్న పోలీసుల అనుమానాలు దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more