హోదా సాధించే సత్తా పవన్ కి ఉంది - శివాజీ | Hero Shivaji says Pawan Kalyan can bring Special Status for AP

Hero shivaji says pawan kalyan can bring special status for ap

Hero Shivaji on Pawan tongue, Pawan Kalyan can bring Special Status, Shivaji praised pawan kalyan, Pawan Kalyan hero shivaji, pawan tongue powerful

Hero Shivaji says Pawan Kalyan can bring Special Status for AP.

ఆయన నాలుక పవర్ ఫుల్ అంటున్న హీరో శివాజీ

Posted: 09/10/2016 03:20 PM IST
Hero shivaji says pawan kalyan can bring special status for ap

ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిందంటూ బీజేపీకి దూరమై, ప్రత్యేక హోదా సాధన సమాఖ్య పేరుతో ఓ పార్టీ పెట్టి దానికి అధ్యక్షుడిగా మారి శివాజీ తన పూర్వ పార్టీపైనే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏకీపడేస్తున్నాడు . ఈ క్రమంలో ఈరోజు నిర్వహిస్తున్న బంద్ లో మరో నేత చలసాని శ్రీనివాస్ తో జోరుగా పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ హోదాపై నటుడు, జనసేన అధినేత పవన్ పోరాడితే తప్పక సాధ్యమవుతుందని చెబుతున్నాడు.

హోదా కోసం గతంలో తాను మాట్లాడితే ఓ ఎంపీ త‌న‌ను నాలుక కోస్తాన‌ని హెచ్చ‌రించార‌ని అన్నారు. మ‌రి జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా హోదా కోసం గ‌ళ‌మెత్తితే ఆయ‌న‌ను నాలుక కోస్తా అని ఎందుకు అన‌లేదని శివాజీ ప్ర‌శ్నించారు. అభిమానులు, ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌ని భ‌య‌ప‌డుతున్నారా? అని దుయ్య‌బ‌ట్టారు. మ‌నిషిని బ‌ట్టి ఎంపీలు ఆచితూచి మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. ఎంత‌కాలం ప్ర‌జ‌ల‌ని మోసం చేస్తారని శివాజీ ప్ర‌శ్నించారు. మ‌నం ఎందుకు భ‌య‌ప‌డాలి? అని అడిగారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే వ్య‌క్తికి హోదా తీసుకొచ్చే స‌త్తా ఉందని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు న‌మ్మిన వ్య‌క్తి ప‌వ‌న్ అని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆయ‌నకు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిరుద్యోగుల ప‌రిస్థితి దారుణంగా ఉందని, కానీ, ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయంటూ కల్లబొల్లి మాట‌లు చెబుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇచ్చింది తీసుకోవాల‌నే ధోర‌ణి వ‌ద్దని సూచించారు. త‌న‌కు రాజ‌కీయాలు చేసే ఉద్దేశం లేదని, ఆంధ్ర‌ ప్రాంతానికి న్యాయం చేయాల‌నే ఉంద‌ని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకున్నారు, ప‌వ‌న్ కల్యాణ్ జ‌నసేన పెట్టుకున్నారు. అలాగే శివాజీ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య పెట్టుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌మేంట‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పోల‌వ‌రం అంటూ తృప్తి ప‌డుతున్నారు.. పోల‌వ‌రం అంత ఈజీగా పూర్త‌వుతుందా? అని శివాజీ ప్ర‌శ్నించారు. భూసేక‌రణ ఇంకా జ‌ర‌గాల్సి ఉంది. పోల‌వ‌రానికి ప‌లు లీగ‌ల్ పాయింట్లు అడ్డుత‌గులుతున్నాయి. చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు ఎంత స‌మ‌యం ప‌డుతుంది? అని ప్ర‌శ్నించాడు. ప్ర‌త్యేక హోదాతోనే రాష్ట్రానికి న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. దాని కోసం అంద‌రూ క‌లిసి పోరాడాల్సిందేన‌ని పిలుపునిచ్చారు. తాము పోరాటాన్ని ఆప‌బోమ‌ని, రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Shivaji  Pawan Kalyan  tongue  special status  

Other Articles