దసరా నుంచి తెలంగాణలో డోర్ టూ డోర్ సర్వీస్ బస్సులు | TSRTC door to door services starts from Dussera

Tsrtc door to door services starts from dussera

TSRTC door to door services, KCR creativity, door to door services starts from Dussera, TSRTC door to door buses, TSRTC door to door buses app, oor to door buses app, telangana RTC mini buses

TSRTC door to door services starts from Dussera.

కేసీఆర్ క్రియేటివిటికి దసరా నుంచి కార్యరూపం

Posted: 09/09/2016 10:17 AM IST
Tsrtc door to door services starts from dussera

ఉమ్మడి రాష్ట్రంలో చవిచూసిన నష్టాలకంటే దారుణంగా తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం పీకలలోతు నష్టాల్లో మునిగిపోయింది. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మధ్య ఎడతెరిపి లేకుండా మూడు రోజులు వరుసగా ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా క్రియేటివ్ ఆలోచనలు చేయాలని, సేవలు సరిగ్గా ఉంటే ప్రజలు రవాణా వ్యవస్థను ఆదరిస్తారని, ఇందుకోసం అవసరమైతే ప్రజలవద్దకే బస్సులను నడపాల్సిందిగా అధికారులకు సూచించాడు. అయితే అది ఆచరణ సాధ్యం అయ్యే పని కాదని అంతా అప్పుడు అనుకున్నారు. రోజులు గడుస్తుంటే దానిని అంతా లైట్ తీస్కున్నారు కూడా. కానీ, త్వరలోనే అది కార్యరూపం దాల్చబోతుందట.

అవును... త్వరలో టీఎస్ ఆర్టీసీ డోర్ టూ డోర్ సర్వీస్ ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా బస్సులు ఇంటి ముందు నుంచే తిరుగుతుంటాయి. ఇంటి ముందు లేదా ఆ వీధిలోకి బస్సులు వచ్చే పరిస్థితి లేకుంటే అతి దగ్గర్లోని పికప్ పాయింట్ వద్ద ఈ బస్సులను ఎక్కవచ్చు. ఇందుకోసం నూతనంగా మినీ బస్సులను తెలంగాణ సర్కారు కొనుగోలు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో ఏసీ బస్సులు, పల్లె ప్రాంతాల్లో నాన్ ఏసీ బస్సులు తిరుగుతాయి. కొత్తగా 236 మినీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన టీఎస్ ఆర్టీసీ, వీటిల్లో 100 ఏసీ బస్సులుంటాయని ప్రకటించింది. దసరా నుంచి మొదలయ్యే ఈ సేవల తొలి దశలో భాగంగా, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో 20 మినీ ఏసీ బస్సులు తిరుగుతాయి. ఇవి ప్రయాణికుల ఇళ్ల ముందుకు వెళతాయి.

ఇక ఈ బస్సులను తమ ఇంటి ముందుకు తెప్పించుకోవాలని భావించేవారి కోసం ఓ మొబైల్ యాప్ ను సిద్ధం చేశారు. ఈ యాప్ ద్వారా చిరునామా చెబితే, సమయానికి బస్సు వచ్చేస్తుంది. తొలిదశలో ప్రజల నుంచి లభించే ఆదరణను చూసిన అనంతరం మిగతా అన్ని ప్రాంతాలకూ ఇవే సేవలను విస్తరిస్తామని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు వెల్లడించారు. గ్రామీణ రూట్లలో అంతగా ఆదాయాన్ని ఇవ్వని పల్లెవెలుగు బస్సులు తిరుగుతున్న ప్రాంతాలకు మలిదశలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.

సొంత వాహనం లేని వారు సమీపంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లకు చేరుకోవడానికి ఎన్నెన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చాల్సి ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆటోలు ఎక్కితే, ప్రయాణించాల్సిన దూరానికి ఆర్టీసీ బస్సుకు ఎంత చెల్లించాలో అంతకన్నా ఎక్కువే పెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఇది వర్కవుట్ అయితే మాత్రం టీఎస్ ఆర్టీసీ లాభాల బాట పట్టడం ఖాయమని అధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  RTC  mini buses  door to door service  Dussera  

Other Articles