Madhya Pradesh: CISF woman officer falls off train trying to save purse from robber

Cisf woman officer falls off train trying to save purse from robber

cisf, madhya pradesh, woman officer, cisf officer, cisf officer guna, railway station robbery, cisf officer robber, woman officer robbed, india news, national news

Suman Dagar was unable to prevent the robber from fleeing with her purse. She incurred serious injuries on her hands and feet due to the fall

దొంగ పట్టుకునేందుకు మహిళా ఎస్ఐ యత్నం.. అంతలోనే..

Posted: 09/06/2016 09:41 AM IST
Cisf woman officer falls off train trying to save purse from robber

తన డ్యూటీ దొంగలను పట్టుకోవడమే. అందుకు కఠోర శిక్షణ కూడా పోందింది. అయితేనేం.. తానెవరో తెలియని ఓ జేబు దొంగకు తన పర్సును అప్పగించింది. అయితే పర్సును దొంగిలిస్తున్న యువకుడి గుర్తించిం వాడి నుంచి దానిని తిరిగి లాక్కునే క్రమంలో ఓ మహిళా ఎస్సై రైలు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సుమన్ దాగర్ సీఐఎస్ఎఫ్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. అజ్మీరు నుంచి జబల్‌పూర్‌కు రైలులో బయలుదేరారు. రుతియాల్ జంక్షన్ వద్ద దాగర్ తన బ్యాగు, ఇతర వస్తువులను తీసుకుని రైలు దిగేందుకు ఎంట్రన్స్ వద్దకు చేరుకున్నారు.

అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి దాగర్ పర్సును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన ఎస్సై అతడి నుంచి దానిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప పెనుగులాట జరిగి ఆమె ఒక్కసారిగా రైలు నుంచి కిందపడ్డారు. ఇదే అదునుగా భావించిన దొంగ పర్సుతో పరారయ్యాడు. రైలు నుంచి కిందపడిన దాగర్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్టు గుణ జీఆర్పీ స్టేషన్ ఇన్‌చార్జ్ ఆర్వీఎస్ పరిహార్ తెలిపారు. పర్సులో రూ.5 వేల నగదు, మొబైల్ ఫోన్, విలువైన పత్రాలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దొంగ కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CISF woman si  Suman Dagar  fall off train  pick pocketer  madya pradesh  

Other Articles