టీ, స్నాక్స్ పేరిట యూపీ మంత్రుల జల్సాలు | UP ministers splurged Rs 9 crore on chai paani in 4 years

Up ministers splurged rs 9 crore on chai paani in 4 years

UP ministers splurged Rs 9 crore on chai paani, 4 years 9 crores for snacks, UP ministers snacks, UP ministers pocket money, ministers splurged public money, leaders waste public money, how leaders waste public money, leaders waste public money, Akhilesh govt splurged public money

UP ministers splurged Rs 9 crore on chai paani in 4 years.

మంత్రుల పాకెట్ మనీ ఎప్పుడైనా విన్నారా?

Posted: 09/01/2016 10:14 AM IST
Up ministers splurged rs 9 crore on chai paani in 4 years

గాదె కింద పందికొక్కుల్లా నేతలు ప్రజా ధనాన్ని తింటున్నా, హా! పది తింటే తింటున్నారు, ఒకటన్నా చేయకపోతాడా? అని సగటు పౌరుడు కూడా లైట్ తీస్కుంటాడు. కానీ, ఉత్తరప్రదేశ్ లో నేతలు ఈ విషయాంలో ఎంత దారుణంగా ఉన్నారో తెలిస్తే మాత్రం ఔరా అనుకోవాల్సిందే. ప్రజా సంక్షమే పథకాలను సైతం పక్కనబెట్టి ప్రజల సొమ్ముతో తమ పొట్టలు ఎలా నింపుకుంటున్నారో మీరే చూడండి.

ఈ నాలుగేళ్లలో కేవలం స్నాక్స్ పేరిట అఖిలేష్ సర్కార్ అక్షరాల 8,78,12,474 (దాదాపు 9 కోట్లు) కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంట. ప్రభుత్వాధికారుల వ‌ద్దకు అతిథులు వచ్చినప్పుడు, అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు, ఆయా సందర్భాలలో టీ, కాఫీ, సమోసా, గులాబ్ జామ్, మిక్చర్ వంటి స్నాక్స్ కోసం ఇంతలా ఖర్చు అయ్యిందంట. ఈ విషయాలను శాసనసభలో స్వయంగా సీఎం అఖిలేష్ వెలువరించడం విశేషం. 2012 మార్చి 15న అఖిలేష్ యాదవ్ యూపీ అధికార పగ్గాలు చేపట్టగా 2016 మార్చి 15 నాటికి అతిథులకు ఇచ్చిన అల్పాహారం వరకు ఈ లెక్కలు ఉన్నాయి.

ఇక ఈ ఖ‌ర్చుల‌లో అత్య‌ధికంగా ఎవ‌రు చేశారో, అత్య‌ల్పంగా ఎవ‌రుచేశారో అన్నది డీటెయిల్ గా చెప్పేశాడు. అత్యధికంగా మంత్రి అరుణ్‌కుమార్‌ కోరి 22,93,800 ఖ‌ర్చు చేస్తే, మంత్రి సదాబ్‌ ఫాతిమా అత్యల్పంగా రూ.72వేలు స్నాక్స్ కోసం ఖ‌ర్చు చేశార‌ట‌. మరో మంత్రి అజాంఖాన్ రూ.22 లక్షలు ఉప‌యోగించేశార‌ట‌. అఖిలేష్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌గానే ఆయ‌న ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టాయి. అయితే విమ‌ర్శ‌ల‌ను అధికార పార్టీ స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నాలు చేసింది.

ఇదిలా ఉండగా ప్రజాధనాన్ని అఖిలేష్‌ ప్రభుత్వం దోచుకుందని బీజేపీ విమ‌ర్శించింది. ప్ర‌జాసంక్షేమ పథకాలను నిర్ల‌క్ష్యం చేసి కోట్లలో ప్రజా ధనం వినియోగించ‌డం ఏంట‌ని దుయ్య‌బ‌ట్టింది. అధికారికంగా యూపీ మీడియా చెబుతున్న విషయం ఏంటంటే... పాకెట్ మనీ పేరిట దాదాపు 28 మంత్రలు నెలకు 12 లక్షల కంటే ఎక్కువగానే ఖజానా నుంచి తీసుకుంటుండగా, మరో డజను మంది 20 లక్షల దాకా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే తామేం ఈ థనాన్ని వృథా చేయటం లేదని, మమల్ని కలవటానికి వచ్చే జనాలకు, అధికారులకు రీఫ్రెష్ మెంట్ పేరుతో టీ స్నాక్స్ సమకూరుస్తున్నామని అజాంఖాన్ చెబుతున్నారు. ఏదేమైనా వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దీనిని ఓ ప్రచార ఆస్త్రంగా వాడుకోవాలని బీజేపీ చూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  ministers  Tea snacks  spent  9 crores  

Other Articles