దేశంలో అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న నేరాలకు ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ రంగు పులుముకోంటోంది. ఉద్యోగులను నియమించుకుని మరీ అరాచకాలు చేసే స్థాయికి నేరగాళ్లు ఎదిగిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో వ్యభిచార ముఠాను అరెస్టు చేసిన పోలీసులు అమ్మాయిలను అక్రమ రవాణా చేయటంతోపాటు వ్యభిచారం కార్పొరేట్ స్టైల్ లో చేయడం చూసి అవాక్కయ్యారు.
వ్యభిచార రాకెట్ నడిపే హుస్సేన్ (50), సైరా భాను (45) లను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించారు. దీంతో ఈ దందా గురించిన ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి అమ్మకాలు సాగించినట్టు గుర్తించారు.
ఇలా అమ్మకాలు సాగించే వారిని ఈ ముఠా అసిస్టెంట్లుగా వ్యవహరించేది. వారు అమ్మాయిలను తీసుకొచ్చి, మేనేజర్లకు అమ్మేవారు. ఈ మేనేజర్లు వారిని నాయికలకు అప్పగించే వారు. ఈ నాయికలు అమ్మాయిలను హ్యాండిల్ చేసేవారు. వీరికి సైరా భాను జీతాలిచ్చి పోషించేది. వారు వీరిని అల్మరాల్లోనూ, షెల్ఫ్ లలోనూ, సొరంగాల్లోనూ దాచి ఉంచేవారు. ఈ సమయంలో విటుల వద్దకు వారే పంపేవారు. ఎదురు తిరిగితే కఠినమైన శిక్షలు ఉండేవి.
50 వేల రూపాయలకు ఒక అమ్మాయిని కొనుగోలు చేసి, 2 లక్షల రూపాయలకు అమ్మేసేవారు. అమ్మాయి వయసు ఎంత తక్కువైతే అంత ఎక్కువ డబ్బుకు అమ్మేసేవారు. ఇలా వారు వంద కోట్ల రూపాయలు సంపాదించారంటే ఎంత మందిని కొనుగోలు చేసి, ఎంతమందిని అమ్మారో ఊహించవచ్చు. ఇవి ప్రాధమిక విచారణలో వెలుగు చూసిన విషయాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఇలాంటి ముఠాలు ఎన్ని ఉన్నాయి? వీరి వెనుక ఉన్న సిండికేట్ ఎవరు? వంటి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా నేరప్రవృత్తి కార్పొరేట్ కల్చర్ రంగుపులుముకుంటుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more