pawan kalyan strongly reacted on mla roja remarks

Pawan kalyan hits out at opposition parties critics

Pawan Jana Sena Prasthanam meeting, opposition parties, Tsp mla Roja, caste editorials, Jana Sena public meeting in tirupati, Jana Sena Prasthanam meeting, Janasena Indira ground, pawan kalyan tirupathi meeting, pawan kalyan special status to AP,

Actor turned politician Jana Sena chief Pawan Kalyan hits out even at opposition parties including ruling parties, reacts srongly at ycpm mla roja on her critics

విపక్షాల విమర్శలపై విరుచుకుపడ్డ పవన్ కల్యాన్

Posted: 08/27/2016 06:38 PM IST
Pawan kalyan hits out at opposition parties critics

తిరుపతి ఇంధిరా గ్రౌండ్స్ వేదికగా జరుగుతున్న ప్రస్తానం బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాన్ అధికార పక్షాలపైనే కాకుండా ఇటు ప్రతిపక్షాలకు చెందిన నేతను కూడా పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తానన్న వాడు ఎందుకు రావడం లేదని, ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై కూడా ఆయన స్పందించాడు. ఇంకోందరైతే తాను ప్రధాని మోదీకి, తెలుగుదేశానికి భజనసేన అని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సినిమాల్లోనే గబ్బర్‌సింగ్ రాజకీయాల్లో రబ్బర్‌సింగ్ అంటూ తనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన విమర్శలను ప్రస్తావించారు. అయితే వీటన్నింటినీ పడాల్సిన అవసరం ఉందనీ, పడతానని పేర్కొన్నారు.

అయితే తాను ఏదిపడితే అది మాట్లాడే టైపు కాదని, ఏదైనా ఆచితూచి మాట్లాడతానని జనసేనాధిపతి పవన్ కల్యాణ్ అన్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందని పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి అన్నారు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోనని, ఏదైనా పూర్తిగా నిర్ధారించుకున్నాకే, తెలుసుకున్నాకే మాట్లాడతానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై అన్ని జిల్లాలు తిరుగుతానని, ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చిరాగానే అది ఇది అంటే కాదని, అందుకోసం గత రెండున్నరేళ్లుగా వేచి చూశామని, ఇకపై తాను ప్రశ్నిస్తానని పవన్ చెప్పారు.

ఇప్పుడు తాను ప్రశ్నించేందుకు సమయం అసన్నమైందిని అందుకునే తాను తిరుపతి వేదికగా ప్రశ్నిస్తున్నానన్నారు. ఇకపై తాను ప్రశ్నిస్తాను.. ప్రశ్నిస్తూనే వుంటాను అని నినదించారు. అయితే అధికార పార్టీలు మాత్రమే హోదా కోసం ప్రధానిని అభ్యర్థించాలని, అ పని తమది కాదు అన్నట్లుగా విపక్షాలు వ్యవహరించరాదని అయన సూచించారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, డిపాజిట్లు రాని పార్టీలైనా రాష్ట్ర ప్రగతి కాంక్షించి అందరూ కలసికట్టుగా ప్రత్యేక హోదా కోసం పాటుపడాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎవరు ముందుకు వచ్చినా వారితో కలసి వచ్చేందుకు తాను, తన పార్టీ ఎప్పుడూ సిద్దమేనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jana Sena  Prasthanam  opposition parties  Roja  special status  Andhra pradesh  

Other Articles