pawan kalyan says janasena first prority is special status

Pawan kalyan sensational remarks on modi venkaiah

Pawan Jana Sena Prasthanam meeting, caste editorials, Jana Sena public meeting in tirupati, Jana Sena Prasthanam meeting, Janasena Indira ground, pawan kalyan tirupathi meeting, pawan kalyan special status to AP, pawan on modi, pawan on venkaiah naidu

Actor turned politician Jana Sena chief Pawan Kalyan sensational comments on pm modi and union minister venkaiah naidu

మోడీపై పవన్ వ్యాఖ్యలు.. వెంకయ్యకూ సూచనలు..

Posted: 08/27/2016 06:00 PM IST
Pawan kalyan sensational remarks on modi venkaiah

ఊహించినట్లుగానే తిరపతి వేదికగా ప్రస్థానం ప్రజా సభతో తన పార్టీ కార్యకర్తలలో నూతన జనజీవాలను పెంపోందించిన పవన్ కల్యాన్ అటు ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ అంటే అభిమానమే కానీ తన రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేంత అభిమానం మాత్రం తాను మోదీపై చూపలేనని స్పష్టం చేశారు. హోదాపై మోదీ ఏమీ తేల్చకపోవడంపై పవన్ కన్నెర్ర చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని నాడు చెప్పిన మోదీ.. చనిపోయిన తల్లిపై కప్పే వస్త్రం ఏదైతేనేం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని నినదించారు.  

రెండు సార్లు టీడీపీ తప్పులను ఎత్తిచూపితే.. కులం గుర్తుకోచ్చిందా..?

రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేస్తే.. అంతే తప్పు.. మరోలా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ తప్పు బీజేపి చేసిందని పవన్ దుయ్యబట్టారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని నినదాన్ని తీసుకువచ్చి కాకినాడలో తీర్మాణాన్ని అమోదించిన బీజేపి.. రాష్ట్రాన్ని విడగోడితే.. ఆంధ్రప్రదేశ్ లోని యువతకు ఎలా న్యాయం చేస్తామన్న దానిపై ప్రణాళికలే రూపోందించలేదని అన్నారు. అంతేకాదు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించడంలో తాత్సారం చేస్తూ.. చివరకు అది జరగదన్న సంకేతాలను కూడా ఇస్తుందని విమర్శించారు.

విడిపోవడం వల్ల క్వాలిటీ విద్యాసంస్థలతో సహా అన్నీ హైదరాబాద్‌కి వెళ్లిపోయాయని, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంతకాలం తాను స్తబ్దుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. అయితే పలువురు రాజకీయ పెద్దలు చెప్పినట్లు రాజకీయాల్లో సహనం అవసరమని తాను కూడా రెండేళ్లుగా వేచి చూస్తూనే ఉన్నానని, రాష్ట్రానికి చెందిన బీజేపీ, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు ఉన్నారనీ, వీరంతా పార్లమెంటులో పోరాటం చేస్తారనుకుంటే అదీ కాలేదన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌పై జనవాణి  ఢిల్లీకి వినిపించేలా చేస్తామని అన్నారు. ఈ క్రమంలో తన పార్టీ తరపున మూడెంచల ప్రణాళిక సిద్దం చేశామని చెపపారు. ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో యావత్ దేశం తమ రాష్ట్రం వైపు చూసేలా ఉద్యమాలను రూపోందిస్తామని హెచ్చరికలు చేశారు.

పవన్ ప్రసంగం1: ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేం  

యూపీఏ పార్లమెంటులో రాష్ట్ర పునర్విభజన బిల్లు పెట్టినప్పుడు.. అడ్డుకుని ప్రత్యేక హోదా కావాలని ఐదేళ్లు, పదేళ్లు సరిపోదని ఏకంగా 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కూడా పవన్ తూర్పారబట్టారు. వెంకయ్య పెద్దవారని, అయన రాజకీయ అనుభవమంత వయస్సు కూడా తనకు లేదని, అయితే ప్రత్యేక హోదాపై అప్పుడు, ఇప్పుడు చేసిన వ్యాఖ్యల్లో మార్పులను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాతో ఒరిగేమీలేదు.. అంతకన్నా ఎక్కువగా రాష్ట్రాన్ని అదుకుంటామన్ని చెబుతున్న వెంకయ్య తక్షణం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పవన్ సూచించారు.

పవన్ ప్రసంగం4: నాకు కులం, మతం అంటగట్టకండి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jana Sena  Prasthanam  special status  Andhra pradesh  pm modi  venkaiah naidu  

Other Articles