స్టేటస్ అంత ఈజీ కాదు, పోరాడి సాధించాలి | pawan kalyan about special status at Tirupathi sabha

Pawan kalyan about special status at tirupathi sabha

pawan kalyan about special status at Tirupathi sabha, pawan on special status, pawan at tirupathi sabha

pawan kalyan about special status at Tirupathi sabha.

పవన్ ప్రసంగం 3:ఎవరికి జెండాలు మోయను.. స్టేటస్ కోసం ఓపిక అవసరం

Posted: 08/27/2016 05:12 PM IST
Pawan kalyan about special status at tirupathi sabha

దేశ ప్రధాని కోసం న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేముందు ఢిల్లీకి వెళ్లి ఆయ‌నతో మాట్లాడాన‌ని, ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెప్పాన‌ని మ‌ళ్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఆయన వద్దకు వెళ్లలేదని జ‌న‌సేన పార్టీ అధినేత, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తిరుప‌తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఈరోజు ఆయ‌న మాట్లాడుతూ ‘నేను మీకు అండ‌గా నిల‌బ‌డ్డాను. మిమ్మ‌ల్ని మోసం చేయ‌ను. బీజేపీ అదిష్ఠానం నుంచి ఓ నేత‌ వ‌చ్చి న‌న్నడిగారు.

జాతీయ పార్టీల‌కే భ‌విష్యత్తు ఉంద‌ని బీజేపీలోకి వ‌చ్చేయ‌మ‌న్నారు. నేనేం స‌మాధానం చెప్పానో తెలుసా..? తెలుసా..? నాకు బీజేపీపై గౌర‌వం ఉందని అన్నాను. తెలుగు రాష్ట్రాల‌ స‌మ‌స్య‌ల కోస‌మే జ‌న‌సేన అన్నాను. ప్రాంతీయ పార్టీ అవ్వొచ్చు జాతీ శ్రేయ‌స్సును కోరే పార్టీ. అంత‌ర్జాతీయ ప్రభావం దేశంపై ఎలా ఉంటుందో కూడా దృష్టి పెట్టే పార్టీ అని చెప్పాను’ అని తెలిపాడు.

అలా బీజేపీలో కి వెళ్లాల‌నుకుంటే ఎప్పుడో వెళ్లిపోయేవాడినని, తాను బీజేపీ పార్టీని గౌర‌విస్తానని కానీ దానిలోకి వ‌చ్చేయ‌ను అని చెప్పినట్లు పవన్ అన్నారు. ‘ఎవ‌రి జెండానో మోయ‌డానికి కాదు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను మోయ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌చ్చా. ఒక‌వైపు మోదీ విదేశాలు తిరుగుతున్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. నాకు హోదాపై ఇటువంటి స‌మయంలో అడ‌గడం ఇష్టం లేదు. లేడీకి లేచిందే ప‌రుగ‌న్నట్లు వ్య‌వ‌హ‌రించ‌లేదు. ముందు చూద్దాం. వారేం చేస్తారో చూద్దాం అనుకున్నాను. కానీ రెండేళ్లు గ‌డిచిపోయాయి.. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడ‌బోయేది స్పెష‌ల్ స్టేట‌స్ కోస‌మే’ అని పవన్ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Tirupathi Sabha  special status  

Other Articles