తిరుపతి సభలో అభిమానులకు పవన్ విజ్నప్తి | pawan request to fans at tirupathi speech

Pawan request to fans at tirupathi speech

pawan request to fans at tirupathi speech, pawan vinod royal at tirupathi sabha

pawan request to fans at tirupathi speech.

పవన్ ప్రసంగం 2: సినిమాను వినోదంగానే చూడండి

Posted: 08/27/2016 04:57 PM IST
Pawan request to fans at tirupathi speech

సినిమాను కేవలం వినోద అంశంగానే చూడాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చాడు. వినోద్ రాయల్ హత్య ఉదంతం తనను ఎంతో కలిచివేసిందని చెప్పాడు. తాను సినిమాలను ఏ రోజూ సీరియస్ గా తీసుకోలేదని ఆయన చెప్పారు. సినిమాలను పెద్దగా పట్టించుకోని తాను జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటానని అన్నారు. సినిమాలు అభిమానించే వారెవరూ వాటిని సీరియస్ గా తీసుకోవద్దని ఆయన హితవు పలికారు. సినిమా నటులను సీరియస్ గా అభిమానించి క్షణికావేశాలతో జీవితాలు నాశనం చేసుకోకండని ఆయన పిలుపునిచ్చారు.

సినీ నటులమైతన తమ మధ్య మంచి వాతావరణం ఉందని, తామంతా చాలా స్నేహంగా ఉంటామని ఆయన చెప్పారు. కోలారులో తన అభిమాని, జనసేన కార్యకర్త రాయల్ వినోద్ హత్య అతని తల్లికి కడుపుకోతను మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు చాలా బాధ అనిపించిందని ఆయన చెప్పారు. అయితే ఆ సమయంలో ఆమె గుండె ధైర్యం ప్రదర్శించి, కుమారుడి కళ్లను దానం చేసిన గొప్ప మహిళ అని ఆమెను అభినందించారు.

అభిమానులు, కార్యకర్తలు తనను చూసేందుకు లేదా తనతో మాట్లేందుకు వస్తే తనకు ఆనందమని చెప్పారు. అయితే అలా వచ్చేవారంతా గుర్తుంచుకోవాల్సింది ఒకటుందని ఆయన చెప్పారు. అంతా క్షేమంగా రండి, క్షేమంగా వెళ్లండి అని ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirupathi  janasena  pawan  speech  

Other Articles