ఆ ఎయిర్ హోస్టెస్ చనిపోయింది శ్మశానం ఫోటోతో | shakambari zutshi died after posted her graveyard photo in facebook

Shakambari zutshi died after posted her graveyard photo in facebook

Airhostess shakambari zutshi died, Airhostess shakambari graveyard photo, graveyard photo kills her, Airhostess killed accident, shakambari zutshi selfie, Airhostess shakambari road accident

Airhostess shakambari zutshi died after posted her graveyard photo in facebook.

ఆ ఫోటోతోనే ఎయిర్ హోస్టెస్ మరణం!

Posted: 08/27/2016 12:17 PM IST
Shakambari zutshi died after posted her graveyard photo in facebook

సోషల్ మీడియాలో అందరి దృష్టి ఆకర్షించేందుకు వింత వింతగా ఫోటోలు దిగుతూ, వారి ద్వారా లైక్ లు, కామెంట్లు పొందుతూ ఆనందించేవారిని చూస్తున్నాం. కానీ, ఆ పిచ్చి ముదిరితే విపరీత అనర్థాలకు దారితీసి, ప్రాణ సంకటంగా మారుతుంది. ఇలా శ్మశానంలో సరదాగా దిగిన ఫోటోనే ఓ ఎయిర్ హోస్టెస్ పాలిట యమపాశంగా మారిందని చెబుతున్నారు కొందరు.

ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ శాకంబరీ జుష్టి ఎయిర్ ఇండియాలో విధులు నిర్వహిస్తోంది. భర్త, పిల్లాడితో ఎయిర్ ఇండియా కాలనీలో ఉంటోంది.  గురువారం సాయంత్రం ఫ్రెండ్స్ తో సరదాగా షికారు వెళ్లిన ఆమె ఓ విచిత్రమైన ఆలోచనతో పక్కనే ఉన్నశ్మశానవాటికలోకి వెళ్లింది. అక్కడ ఓ సమాధిపై కూర్చుని నవ్వుతూ సెల్ఫీ దిగి, దానిని ఫేస్ బుక్ లో సంతోషంగా షేర్ చేసింది.  కానీ, ఆమె స్నేహితులు మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కామెంట్లు పెట్టారు.

కట్ చేస్తే శుక్రవారం ఉదయం ఢిల్లీ వసంత్ కుంజ లో రాజోక్రీ ఫ్లై ఓవర్ మీద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ట్రక్, ఇన్నోవా, ఇండికా కారు మూడు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన  శాకంబరీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. శ్మశానంలో ఫోటో దిగినందుకే ఆమె చనిపోయిందని కొందరు చెబుతున్నారు. కాగా, ఆ సెల్ఫీ కిందే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఇంకో ఫోటోతో స్నేహితులు సంతాపం తెలపటం విశేషం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Airhostess  shakambari zutshi  died  road accident  graveyard photo  

Other Articles