నట్టికుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కళ్యాణ్ | Producer C Kalyan fire on nattikumar over links with Nayeem

Producer c kalyan fire on nattikumar over links with nayeem

Producer C Kalyan fire on nattikumar, producer kalyan over links with Nayeem, nattikumar over links with Nayeem, Producer C Kalyan fire on nattikumar

Producer C Kalyan fire on nattikumar over links with Nayeem

ITEMVIDEOS:నట్టికుమార్ టాలీవుడ్ నయీం, బ్లూ ఫిల్మ్స్ తీసేవాడు: కళ్యాణ్

Posted: 08/26/2016 10:20 AM IST
Producer c kalyan fire on nattikumar over links with nayeem

కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం తో టాలీవుడ్ పై నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలపై మరోనిర్మాత సీ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. నయీంతో కలిసి దందాలు చేశారంటూ కొందరి పేర్లను నట్టి కుమార్ పలు టీవీ చానెళ్లలో ప్రస్తావించించగా, అందులో సీ.కళ్యాణ్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో నయీంతో ఎవరికీ సంబంధాలు లేవని సీ.కళ్యాణ్ అంటున్నారు. వైజాగ్ నుంచి తరిమేస్తే హైదరాబాద్ వచ్చిన నట్టికుమార్ వార్తల్లో పాపులర్ కావాలనే ఇలా పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని కళ్యాణ్ వివరించారు.

శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ కూడా తెర ముందుకు వచ్చారు. తనపై నట్టికుమార్ చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సి ఉన్నందునే తాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నట్టికుమార్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఓ పిచ్చి కుక్క దారి పోలీసులను, ప్రజలను తప్పుదోవపట్టిస్తోంది. ‘నోరు జారితే చెప్పు తెగుద్ది’ పరుష పదజాలాన్నే వాడాడు.

 

ఇండస్ట్రీలో నట్టికుమార్ ఎందరినో మోసం చేశాడని, ఆ బాధితుల్లో నేను ఒకడినని ఆయన చెప్పుకోచ్చాడు. నట్టికుమార్ కొడుకు గతంలో తాను సహ నిర్మాతగా వ్యవహరించిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాను ఆన్ లైన్ లో లీక్ చేశాడని, ఆపై ఫిర్యాదు చేస్తానని చెప్పటంతో వాటిని తొలగించాడని తెలిపాడు. నట్టి బాధితుల జాబితా నయీం కన్నా పెద్దదిగా ఉంటుందని వివరించాడు. నయీం బాధితులకు మల్లే నట్టికుమార్ బాధితుల కోసం కూడా ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కూడా కల్యాణ్ డిమాండ్ చేశారు.. నట్టికుమార్ చరిత్ర మొత్తం బ్లాక్ మెయిలింగ్ తో కూడుకుందని, దేవుడి పేరు చెప్పుకుని పాపపు పనులు చేశాడని విమర్శించాడు.

తన సినిమాల్లో నటించే హీరోయిన్ల నగ్న చిత్రాలను సేకరించి, వారిని బ్లూ ఫిల్మ్ లలో నటించాలని బెదిరించిన సందర్భాలు ఉన్నాయని, ఈ మేరకు అతనిపై కోలీవుడ్ లో ఫిర్యాదులు ఉన్నాయని కళ్యాణ్ చెప్పాడు. నయీం తో సంబంధాలున్నాయన్న ఆరోపణలు నిజమని తేలితే ఎంతటి పెద్దవాళ్లనైనా అరెస్ట్ చేయవచ్చని నిర్మాతల తరపున పోలీసులను కోరుతామని వివరించారు. తనతోపాటు పలువురిపై ఆరోపణలు చేసిన నట్టికుమార్ వద్ద ఆ ఆధారాలను బయటపెట్టాలని, లేకపోతే కోర్టుకు ఇడుస్తానని హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Producer C kalyan  fire  Natti Kumar  Nayeem  

Other Articles