Maharastra deal is fraud alleges congress, protests state-wide

Telangana congress state wide protest over maharastra deal

uttam kumar reddy, maharashtra deal, congress protests, irrigation projects coment, Mallu Ravi, state-wide protests, Telangana congress,

Telangana congress state wide protest over maharastra deal, alleges that telangana KCR government is hiding the facts from people,

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ నిరసనలు

Posted: 08/23/2016 07:29 AM IST
Telangana congress state wide protest over maharastra deal

మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి పెను నష్టాన్ని మిగుల్చుతుందని, దీనిని తక్షణమే రద్దు చేసుకుని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ప్రభుత్వం చేసుకుంటున్నది మహా ఒప్పందం కాదు, ఇది మహా ద్రోహమని టీపిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాణహిత-చేవెళ్లను కాదని రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని ఉత్తమ్ అన్నారు.
 
మహారాష్ట్రతో సీఎం కేసీఆర్ కుదుర్చుకునే ఒప్పందం వల్ల తెలంగాణకు నష్టమేనన్నారు. దీనిపై మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. మట్టపల్లి పుణ్యక్షేత్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. యాదాద్రిలా మట్టపల్లిని తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. స్థానికంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఉంటే ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేవారన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఉత్తమ్ అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ఒప్పందాలతో తెలంగాణకు తీరని నష్టం ఏర్పడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, దేవాదుల ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిందీ తామేనన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles