నల్గొండ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి చనిపోయింది యాక్సిడెంట్ లో కాదా? హత్యా? దాని వెనుక ఎవరు ఉన్నారు? గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత వెలుగు చూస్తున్న కోణాలు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లను పంచుతున్నాయి. 5 ఏళ్ల క్రితం మెదక్ రామచంద్రాపురం, కొల్లూరు వద్ద జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితోపాటు అతని మరో ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే చనిపోగా, ఒకతను మాత్రం గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుపక్కనున్న మట్టి కుప్పను తాకి కారు పల్టీలు కొట్టి ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారణ కూడా చేశారు.
అయితే అది హత్యేనని, చేయించింది నయీమేనని అంటున్నాడు వ్యాపారి గంపా నాగేందర్. నయీం పోయాక బయటికి వస్తున్న అతని బాధితులు ఒక్కోక్కరుగా పోలీసుల ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగేందర్ ఈ సంచలన ప్రకటన చేశాడు.
‘గత మార్చి 18న కొందరు నన్ను నయీం వద్దకు తీసుకువెళ్ళారు. రూ.5 కోట్లివ్వాల్సిందిగా నయీం నన్ను డిమాండ్ చేశాడు. లేదంటే నా కుటుంబీకుల్ని హతమారుస్తానన్నాడు. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా నా కుమారుల్ని చంపుతానన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకునూ అలాగే చంపానన్నాడు. అది హత్య అని ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చాడు’’ అని వివరించాడు. ఈ మేరకు ఐదు రోజుల క్రితం భువనగిరి పోలీస్ స్టేషన్ లో నాగేందర్ ఫిర్యాదు కూడా చేశాడు.
అయితే ఇది కేవలం బెదిరింపు కూడా కావొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశాకే ఓ నిర్ణయానికి వస్తామని చెబుతున్నారు. కాగా, తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ నయీం తనను బెదిరించాడని వెంకట్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more