పవన్ కళ్యాణ్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ | Karnataka Ex CM H D Kumaraswamy to meet pawan kalyan

Karnataka ex cm h d kumaraswamy to meet pawan kalyan

Karnataka Ex CM meet pawan kalyan, Pawan kalyan Kumara Swamy, Kumarswamy with Pawan kalyan, Ex CM meet Pawan Kalyan, Pawan Kalyan with EX CM, Kumaraswamy Pawan Kalyan

Karnataka Ex CM H D Kumaraswamy to meet pawan kalyan.

పవన్ కళ్యాణ్ తో మాజీ సీఎం భేటీ?

Posted: 08/20/2016 11:42 AM IST
Karnataka ex cm h d kumaraswamy to meet pawan kalyan

హైదరాబాదులో మరికాసేపట్లో కీలక భేటీ జరగనుంది. టాలీవుడ్ అగ్రహీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ సీఎం ఒకరు భేటీ కావటం ప్రత్యేకతను సంతరించుకుంది. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి శనివారం ఉదయం హైదరాబాదులో అడుగుపెట్టారు.

శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన ఆయన నేరుగా జూబ్లీహిల్స్ కు బయలుదేరారు. పవన్ కల్యాణ్ తో భేటీ కోసమే ఆయన హైదరాబాదు వచ్చినట్లు సమాచారం. వీరి మధ్య భేటీలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయా? లేదా సినిమాకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతుందా? అన్నదానిపై స్పష్టత లేదు.

అయితే కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా క‌న్నడ‌, తెలుగు, త‌మిళ ప‌రిశ్రమ‌ల‌కు ఏక‌కాలంలో ప‌రిచ‌యం అవుతున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా, 75 కోట్లతో `జాగ్వార్‌` చిత్రం కుమారస్వామియే నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ లో పాల్గొనాల్సిందిగా పవన్ ను ఆహ్వానించేందుకే కలవబోతున్నాడని మరో టాక్ వినిపిస్తోంది. అయితే మాజీ సీఎం, ఉన్నపళంగా పవన్ ను కలవటంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. అసలు విషయం ఏంటనేది మరికాసేపట్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Kumara Swamy  Karnataka EX CM  Janasena Party  

Other Articles