నయీం ఇష్యూలో దినేశ్ రెడ్డి ప్రెస్ మీట్ వాయిదా | Dinesh Reddy press meet cancelled in Naeem Issue

Dinesh reddy press meet cancelled in naeem issue

Dinesh Reddy press meet, Dinesh Reddy press meet cancelled, BJP warns Dinesh reddy, Dinesh Reddy press meet about Naeem, Dinesh Reddy Naeem, Naeem Dinesh Reddy

Dinesh Reddy press meet cancelled in Naeem Issue.

దినేశ్ రెడ్డిని బీజేపీ ఎందుకు ఆపుతోంది?

Posted: 08/13/2016 12:14 PM IST
Dinesh reddy press meet cancelled in naeem issue

గ్యాంగ్ స్టర్ తో నయీంతో ఓ మాజీ డీజీపీకి సత్ససంబంధాలు ఉన్నాయన్న వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే సదరు పోలీస్ బాస్ గతంలో రాజకీయంగా ఓ ట్రయల్ వేశారని మీడియా ఉప్పందించడంతో అనుహ్యాంగా దినేశ్ రెడ్డి పేరు బయటికి వచ్చింది. దీంతో ఉమామాధవరెడ్డి మాదిరిగానే ప్రెస్ మీట్ పెట్టి తాను నిర్దోషినని ప్రకటించేందుకు ఆయన సిద్ధమయ్యారు.

కాసేపటి క్రితం హైదరాబాద్ బీజేపీ ఆఫీసుకు రావాలంటూ మీడియాకు దినేశ్ రెడ్డి నుంచి పిలుపు అందింది. అయితే ప్రస్తుతం ఈ మీడియా సమావేశంపై సందిగ్థత నెలకొంది. దీనిపై స్పందించిన బీజేపీ అధిష్ఠానం, ప్రెస్ మీట్ అవసరం లేదని దినేశ్ రెడ్డికి సలహా ఇచ్చింది. అంతేకాదు పార్టీ ఆఫీస్ లో నిర్వహించుకునేందుకు వీలు లేదని ఖరాకండిగా చెప్పేసిందట. దీంతో సాంకేతిక కారణాలంటూ దానిని వాయిదా వేశారు.

నయీం కేసులో నేరుగా తన పేరు రాకుండానే స్పందించడం ఎందుకంటూ దినేశ్ రెడ్డి ని బీజేపీ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను ఇప్పటికే మీడియాకు సమాచారం పంపానని, అందుకే తాను మాట్లాడటానికి సిద్దమయ్యాయని దినేశ్ రెడ్డి సమాధానం చెప్పాడంట. 

ఉమ్మడి రాష్ట్ర డీజీపీ గా పని చేసిన దినేశ్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీలో చేరి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయం తీర్థం పుచ్చున్నారు. త్వరలో ఆయనకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ సన్నాహాలు కూడా చేస్తోంది. ఇంతలోనే నయీం ఎన్ కౌంటర్, ఆయన పేరు బయటికి రావటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naeem  Dinesh Reddy  press meet  

Other Articles