sit chief nagireddy says 12 cases filed on gangster nayeem

Sit chief appeals gangster nayeem victims to approach them

gangster nayeem, nayeem bedroom, nayeemuddin, sit, special investigation team, IG nagireddy, currency bundles, land documents, mahaboobnagar, Telangana

Telangana special indvetigation team headed by Inspector General Nagireddy says victims of gangster nayeem can approch them.

గ్యాంగ్ స్టర్ నయీమ్ సహా అనుచరులపై 12 కేసులు

Posted: 08/12/2016 12:09 PM IST
Sit chief appeals gangster nayeem victims to approach them

గ్యాంగ్స్టర్ నయీం కేసులో ఇప్పటివరకూ 18మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం మీడియాకు వెల్లడించారు. సోదాల్లో రాష్ట్రవ్యాప్తంగా 599 ల్యాండ్ డాక్యుమెంట్లు, 19 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. 2 కిలోల బంగారం, 2.88 కోట్ల నగదు, 6కార్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ 12 కేసులు నమోదు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. బాధితులెవరైనా ఉంటే తమను ఆశ్రయించవచ్చని నాగిరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నయీంకు గల సంబంధాలపై డీజీపీ ఆదేశిస్తూ విచారణ చేస్తామన్నారు. అలాగే నయీం ఇంట్లో అదుపులోకి తీసుకున్న 9మంది చిన్నారులను బాలసదన్కు తరలించినట్లు నాగిరెడ్డి చెప్పారు.

మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్లో ఎన్కౌంటర్ జరిగిన ఇంటి నుంచి రెండు ఏకే-47 గన్లు, స్టెన్గన్, 4 రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 సెల్ఫోన్లు, మారుతీ డిజైర్, హోండా అమేజ్, స్కూటీని సీజ్ చేశారు. రూ.3.74 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారం, వ్యవసాయ భూములకు సంబంధించిన 121 డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకున్నారు. అలాగే సంఘటనా స్థలంలో భువనగిరికి చెందిన సలీమాబేగం, మిర్యాలగూడకు చెందిన మతీన్ భార్య ఖలీమ, నయిముద్దీన్ భార్య హసీనాను పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles