planets form large triangle as celestial phenomenon in the sky

Mars saturn and moon align during perseid meteor shower tonight

celestial phenomenon, triangular course of planets, miracle in the sky, thursday night miracle, planets in triangle, Skywatchers, southern hemisphere

Skywatchers in will be able to witness a celestial "summit meeting" this week as the moon, Mars and Saturn converge in the south-southwest evening sky.

ITEMVIDEOS: ఖగోళంలో అద్భుతం.. త్రిభుజాకారంలో గ్రహాలు..

Posted: 08/12/2016 12:06 PM IST
Mars saturn and moon align during perseid meteor shower tonight

ఆకాశంలో గురువారం రాత్రి ఖగోళ అద్భుతం కనువిందు చేసింది. గురువారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 7 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మూడుగ్రహాలు త్రిభుజాకారంలో కనిపిస్తూ నగర ప్రజలను కనువిందు చేశాయి. గురుడు (జూపిటర్‌), బుధుడు (మెర్యూ్కరీ), శని (వీనస్‌) గ్రహాలు చంద్రుని కింది భాగంలో ఒక క్రమపద్ధతిలో అమరి చూసేందుకు స్పష్టంగా త్రిభుజాకృతిలో కనువిందు చేశాయి. కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా, స్పేస్‌ మెడిసనల్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప నిర్వాహకులు పలువురికి టెలీస్కోపు ద్వారా మరింత స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. గురుగ్రహం తెల్లటి కాంతితో, బుధగ్రహం ఎర్రటి వర్ణంతో, శనిగ్రహం తెల్లటి కాంతిరహితంగా కనిపించి కనువిందు చేశాయి.

ఉల్కాపాతం..

కాగా పర్‌షిడ్‌ ఉల్కాపాతం గురువారం అర్ధరాత్రి జరగడంతో నగర ప్రజలు ఎక్కువ మంది వీక్షించలేకపోయారు. రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఉల్కాపాతం చోటుచేసుకుందని, దీనిని వీక్షించలేని వారు శుక్రవారం రాత్రి మళ్లీ జరిగే ఉల్కాపాతం వీక్షించవచ్చని ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా, స్పేస్‌ మెడిసనల్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప నిర్వాహకులు అబ్రారుల్‌హక్‌ తెలిపారు. ఈ వీక్షణంలో స్పేస్‌ మెడిసినల్‌క్లబ్‌ సభ్యుడు నాయక్, జాహిద్‌అస్లాం, సాయిబాబా హైస్కూల్‌ విద్యార్థి శానుల్‌ఫైజ్, న్యూహోరైజన్‌ స్కూల్‌ విద్యార్థి సాజిద్‌హుస్సేన్‌లు స్పేస్‌ స్టుమినేటర్స్‌ గా విచ్చేసి వీక్షణ కార్యక్రమంలో సహకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles