కేసీఆర్, చంద్రబాబు నాయుడు పుష్కర స్నానాలు | KCR and Chandra babu naidu taking holy bath at Krishna Pushkaras

Kcr and chandra babu naidu taking holy bath at krishna pushkaras

KCR Krishna Pushkara Bath, Chandra Babu Krishna Pushkara Bath, Balayya Krishna Pushkaralu, CBN balayya Krishna Pushkaralu, Balayya Pushkara Bath

Telugu State CMs taking holy bath at Krishna Pushkaras. KCR at gondimalla, Chandra Babu Naidu at Durga Ghat along with families.

ITEMVIDEOS:మొదలైన పుష్కర శోభ... ఇరు సీఎంల పుణ్య స్నానాలు

Posted: 08/12/2016 11:52 AM IST
Kcr and chandra babu naidu taking holy bath at krishna pushkaras

తెలుగు రాష్ట్రాల్లో పుష్కర సంబరం ప్రారంభమయ్యింది. నేటి తెల్లవారుజామున మొదలైన కృష్ణా పుష్కరాల్లో భాగంగా ప్రారంభ సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు పోటెత్తారు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సతీసమేతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ లలో తెల్లవారు ఝామునే పుణ్య స్నానాలు ఆచరించారు.

నిన్న సాయంత్రమే మహబూబ్ నగర్ చేరకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొందిమళ్ల పుష్కర ఘాట్ లో పుష్కర స్నానం చేశారు. ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన వేద పండితులకు పాదాభివందనం చేశారు. ఆ తర్వాత పేరు పేరునా వేద పండితులకు ఆయన ఘన సత్కారం చేశారు. అనంతరం నేరుగా జోగులాంబ దేవాలయానికి వెళ్లారు. సతీసమేతంగా ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్... జోగులాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దాదాపు 850 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాలను చరిత్రలో నిలిచి ఉండిపోయేలా నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు.

ఇక ఏపీలో కొనసాగుతున్న పుష్కరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. శుక్రవారం వేకువఝామునే విజయవాడలోని దుర్గా ఘాట్ కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన చంద్రబాబు... పుష్కరుడికి హారతి ఇచ్చి పూజలో పాల్గొన్నారు. గురువారం రాత్రే పుష్కరుడు కృష్ణా నదిలో ప్రవేశించినందున శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా ముహూర్తం ఏదీలేకుండా ఆయన స్నానం చేయటం విశేషం. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు పుష్కర స్నానం చేశారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో కలిసి సూర్యోదయం వేళనే ఆయన కుటుంబ సమేతంగా పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రి వద్ద కంట్రోల్ రూంను ప్రారంభించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వరుసగా నాలుగు రోజులు సెలవు రోజులు ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఇరు ప్రభుత్వాలు ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Chandra Babu  Krishna Pushkaralu  holy bath  

Other Articles