చైనా పవర్ ఫ్లాంట్ లో భారీ పేలుడు | 21 killed in China power plant explosion

21 killed in china power plant explosion

China explosion, China Power plants, Dangerous power plants in china, China blast, China power plant blast

An explosion at a plant in central China yesterday afternoon has killed at least 21 people and injured five, state media reported.

చైనా పవర్ ఫ్లాంట్ లో భారీ పేలుడు... 21 మంది దుర్మరణం

Posted: 08/12/2016 08:51 AM IST
21 killed in china power plant explosion

చైనా పవర్‌ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుబేయి ప్రావిన్స్‌లోని డాంగ్‌యాంగ్ నగరంలో ఉన్న మేడియన్ గాంగ్వూ పవర్ జనరేషన్ కంపెనీలో హైప్రెజర్ స్టీమ్ పైపు గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలిపోయింది.

డ్యామేజ్ అయ్యిందన్న అనుమానంతో పైపును పరిశీలిస్తుండగా, హఠాత్తుగా పేలటంతో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు వెనుక గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

కాగా, కార్మికుల భద్రత, పర్యావరణ నిబంధలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల చైనాలో ఇటీవల పారిశ్రామిక ప్రమాదాలు సర్వ సాధారణంగా మారిపోయాయి. గతేడాది తియాన్‌జిన్ పేలుడులో 173 మంది మరణించిన సంగతి తెలిసిందే. నేటికి సరిగ్గా అది ఏడాది పూర్తి చేసుకోగా, ఒకరోజు ముందు మరో బ్లాస్ట్ చోటు చేసుకోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Power Plant  Explosion  21 killed  

Other Articles