Telangana police shocked after raiding gangster nayeem assets

Gangster nayeem assets cross mumbai mafia illegal business

gangster nayeem, nayeem, nayeemuddin, shadnagar encounter, nayeem cook, currency bundles, land documents, assets, thiousand crores, weapons,mahaboobnagar, Telangana

Telangana police shocket after raiding gangster Nayeem residence and guest houses and acuumilating his assets which crosses net worth more than mumbai mafia.

నయీమ్ అస్తుల వివరాలతో ఖంగుతిన్న పోలీసులు

Posted: 08/10/2016 08:33 AM IST
Gangster nayeem assets cross mumbai mafia illegal business

మావోయిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. తరువాత కోవర్టుగా మారి.. పోలీసులచేత పెంచి పోషించబడినట్లు అరోపణలు ఎదుర్కిని.. వారి చేతులోనే హతమైన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం అస్తుల వివరాలు తెలుసుకుని తెలంగాణ పోలీసులు షాక్ కు గురయ్యారు. ముంబై మాఫియాను మించిన ఆస్తులను నయామ్ అక్రమమార్గంలో సంపాదించాడని పోలీసులు తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. సమసమాజ స్థాపన కోసం నక్సల్ ఉద్యమంలో చేరిన నయీమ్.. ఉద్యమానికి తూట్లు పోడిచి గ్యాంగ్ స్టర్ గా ఎదిగి వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది.

మరో విధంగా చెప్పాలంటే ముంబై మాఫియాను తలదన్నేలా నయీమ్ ఆక్రమ మార్గంలో అస్తులను కూడబెట్టుకున్నట్లు తెలుస్తుంది. తొలుత పోలీసులు సహాకారంతోనే కోవర్టుగా మారిన నయీమ్.. అప్పటి నుంచి వక్రమార్గం పట్టి అస్తులను కూడబెట్టడం ప్రారంభించినట్లు తెలంగాణ పోలీసులు తేల్చారు. నయీమ్ ఇళ్లు, గెస్ట్ హౌజ్ లలో నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడంతో ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.

నయీం ఆస్తుల వివరాలు

కొండాపూర్లో ఒకే చోట 69 ఎకరాల భూమి
దీని విలువ వెయ్యి కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని రెవిన్యూ అధికారాలు అంచనా
పుప‍్పాలగూడ, మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వీటి విలువ మరో వెయ్యికోట్ల వరకు ఉండవచ్చు
నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో బొమ్మలరామరంలో 500 ఎకరాలు
హైదరాబాద్ నగరంలో పదలుకొద్దీ ఫ్లాట్లు
ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు
ఆడి కారు సహా హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఎండీవర్ కార్లు
సరూర్ నగర్లోని ఎన్టీఆర్ నగర్లో 1180 గజాల సైటు  ప్లాను స్వాధీనం
గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నెంబర్ 230/231 పత్రాలు స్వాధీనం
అత్తాపూర్లో సర్వే నెం 462, 468లో ఫ్లాటు నెంబర్ 9 పత్రాలు గుర్తింపు
కొండాపూర్లో సర్వే 87 పత్రాలు స్వాధీనం
షేక్పేట్లో మరో ఫ్లాటు పత్రాలు స్వాధీనం
ముసారాబాద్లో మరో నాలుగు స్థలాల పత్రాలు గుర్తింపు
జూబ్లిహిల్స్లో 1365 గజాల స్థలాన్ని లాక్కున్న నయీం
భువనగిరిలోనే 175 ఫ్లాట్ల డాక్యుమెంట్లు గుర్తింపు
ఘట్కేసర్, రామంతపూర్  గౌలిపుర, అమీన్పుర ప్రాంతాలకు చెందిన భూమి పత్రాలు స్వాధీనం

ఆయుధాలు, ఫోన్లు

ఇప్పటివరకు 4 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్
వేర్వేరు కంపెనీలకు చెందిన 258 సెల్‌ఫోన్లు స్వాధీనం
డైరీలు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, మెమొరీ కార్డుల, ల్యాప్టాప్లు స్వాధీనం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles