ఆంధ్రా అమిత్ షా మాగంటి బాబు | TDP MP Maganti Babu Turns as BJP Amit Shah

Tdp mp maganti babu turns as bjp amit shah

TDP MP Maganti Babu Turns as BJP Amit Shah, Andhra Amith shah, Maganti Babu junior amith shah

TDP MP Maganti Babu Looks like BJP chief Amit Shah and hul chul in parliament.

ITEMVIDEOS: ఆంధ్రా అమిత్ షా వేసిన కౌంటర్ అదిరిపోలా!

Posted: 08/10/2016 09:22 AM IST
Tdp mp maganti babu turns as bjp amit shah

శరీరాకృతి, అదే రీతిలో బట్టతల ఉండి అచ్చం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాదిరిగానే ఉండే టీడీపీ మాగంటి బాబుకు ఇన్నాళ్లూ గడ్డం ఒక్కటే తక్కువ అని సాటి నేతలు తెగ ఫీలయిపోయేవారు. హైట్ పర్సనాలిటీ అన్ని విషయాల్లో కూడా అమిత్ షాకు జిరాక్స్ కాపీలా ఉండే మాగంటిని చూసి ఓ సందర్భంలో దూరం నుంచి చూసిన ఓ బీజేపీ ఎంపీ అమిత్ షా క్లీన్ షేవ్ చేసుకున్నాడా అని భావించి దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోయాడంట. అంతలా ప్రింట్ ఉంటారన్న మాట మన ఆంధ్రా ఎంపీ. అయితే ఏమనుకున్నారో ఏమో ఈ మధ్య భారీ గడ్డం పెంచేసిన ఈ ఏలూరు ఎంపీ పార్లమెంట్ లో అమిత్ షా డూప్ లాగా హల్ చల్ చేశారు.

శరీరాకృతిలోనే కాకుండా తలకట్టు తీరులోనూ అమిత్ షా లా కనిపించే మాగంటి... ప్రస్తుతం గడ్డం పెంచేయటంతో ఆయనను చూసిన వారంతా అమిత్ షాగానే పొరబడుతున్నారు. పార్లమెంటు లాబీల్లో మాగంటి కూర్చోగా... ఆయనను అమిత్ షా లా భావించి పలువురు బీజేపీ ఎంపీలు దగ్గరికి వచ్చి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో  మంగళవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  

బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజులు టీడీపీపీపీ కార్యాలయం వద్దకు రాగా... అక్కడ ఉన్న మాగంటిని ఒక్కసారిగా అవాక్కయ్యారంట.. ‘‘చూడటానికి మా అమిత్ షా లానే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తున్నట్లు ఏ రాత్రో మీరే ఓ ప్రకటన చేయొచ్చుగా?’’ అని వారు మాగంటితో జోక్ చేశారంట. దానికి స్పందించిన మాగంటి ‘ప్రత్యేక హోదా ఫైల్ పై సంతకం చేస్తూ ఓ ఫొటో తీసుకుని దానికి మీడియాకు పంపుతాను. ఆ ఫొటోలో ఉన్నది అమిత్ షానే అనుకుంటే మీ పార్టీ ఇబ్బంది పడక తప్పదు’ అని అంతే చమత్కారంతో కౌంటర్ వేసేశారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Eluru MP  Maganti Babu  BJP  Amith Shah  Andhra Amith Shah  

Other Articles