మణిపూర్ ముఖ్యమంత్రి అయి తీరుతానంటున్న ఇరోమ్ షర్మిలా | Irom Sharmila wants to become CM to eradicate AFSPA

Irom sharmila wants to become cm to eradicate afspa

Irom Sharmila end past, sharmila ends hunger strike, Iron lady Irom Sharmila ends past

Irom Sharmila wants to become CM to eradicate AFSPA Act.

ఉక్కు మహిళ నోట సంచలన వ్యాఖ్యలు

Posted: 08/09/2016 04:32 PM IST
Irom sharmila wants to become cm to eradicate afspa

నన్ను మిగతా వాళ్లలా మాములుగా ఎందుకు చూడరంటూ ప్రశ్నిస్తోంది మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలా. పదహారేళ్లు కేవలం ఫ్లూయిడ్స్ తోనే దీక్ష కొనసాగించిన షర్మిలా ఎట్టకేలకు మంగళవారం దీక్ష ముగిస్తున్నట్లు ప్రకటించింది. తనకు సాధారణ జీవితం గడపాలని ఉందని చెబుతున్న ఆమె తనపై ఉన్న కేసులు ఎత్తివేయాలని దీక్ష విరమించే ముందు న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. అయితే తప్పు చేసినట్లు ఒప్పుకుంటేనే కేసులు ఎత్తివేస్తామని న్యాయమూర్తి చెప్పటంతో విచారణ 23వ తేదీకి వాయిదా పడింది.

మ‌ణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా, ప్రజా హక్కుల కోసం 28 ఏళ్ల వయసులో 2000 సంవత్సరం నవంబర్ నుంచి ఆమె దీక్ష కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించి ఆత్మహత్య యత్నం కింద 17 సార్లు ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా, జైల్లోనే ఆమె దీక్ష కొనసాగించింది. కాగా, కోర్టు ఆదేశాలతో ఫ్లూయిడ్స్ తీసుకుంటూ దీక్ష కొనసాగించేందుకు ఆమెకు అనుమతి దొరికింది. ఈ యేడాది మొదట్లో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ సాయుధ బలగాలను ఉపసంహరించుకునేందుకు మణిపూర్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవటంతో ఆమె దీక్ష విరమించాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను మురికి గుంటలుగా ప్రజలు అనుకుంటారు. కానీ, తాను చేస్తోన్న డిమాండ్‌ను నెర‌వేర్చుకునేందుకు ఇంతకు మించి మార్గం కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించింది. ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటన వెలువడగానే బీజేపీ, కాంగ్రెస్ లు ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యాయి. కానీ, ఆమె మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. వచ్చే ఏడాది మణిపూర్ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తా... భవిష్యత్తులో ఖచ్చితంగా మ‌ణిపూర్‌కి సీఎం అవుతాన‌ని ప్రకటించారు. కాగా, ఆమెపై ఉన్న కేసుల‌పై ఇరోమ్ ష‌ర్మిల‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల వ్యక్తిగ‌త బాండ్ స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.

ప్రస్తుతం గోవాలో ఉంటున్న డేస్మండ్ కోటిన్హో అనే బ్రిటీష్ సంతతి వ్యక్తిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. ఆమె భావజాలాల పట్ల ఆకర్షితుడైన డేస్మండ్ ఉత్తరాలతోనే ఆమె ప్రేమించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు కలుసుకున్నారు కూడా. అయితే ఉధ్యమాన్ని పక్కదారి పట్టించేందుకే అతన్ని మణిపూర్ ప్రభుత్వం అతన్ని రంగంలోకి దింపిందన్న విమర్శలు రాగా, అదంతా ఉత్తదేనని ఆమె స్వయంగా ఖండించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iron Lady  Irom Sharmila  16 years  hunger strike  end  

Other Articles