ముని కోటి కుటుంబానికి జనసేన తరపున పవన్ ఆర్థిక సాయం | Pawan donate 5 lakhs to Munikoti family

Pawan kalyan financial assistance to munikoti family

pawan kalyan Muni koti, Muni koti family, pawan helps to Muni koti family, special status death, Muni koti family pawan, pawan meets Muni koti family, Muni koti family meets Pawan Kayan

Pawan Kalyan janasena donate 5 lakhs to Muni Koti family.

ప్రత్యేక బలిదానానికి అండగా పవన్

Posted: 08/09/2016 03:25 PM IST
Pawan kalyan financial assistance to munikoti family

సరిగ్గా ఏడాది క్రితం మునుకోటి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పత్రికల్లో, చానెళ్లలో మారుమ్రోగిపోయింది. తిరుపతిలో ప్రత్యేక హోదాను డిమాండ్ తో నినదిస్తూ ఆత్మ బలిదానం చేసుకున్న యువకుడు. వందలాది మంది చూస్తుండగానే, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న మునికోటి వార్తను జాతీయ మీడియా కూడా హైలెట్ చేసి ప్రజల్లో హోదా సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో తెలియజేశాయి. కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్న మునికోటి కుటుంబాన్ని ఆదుకుంటామంటూ అప్పట్లో స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు కూడా.

ఏడాది గడిచింది. రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తామని చెప్పిన సర్కారు, ఇచ్చిన మాటను మరచింది. సొంత కార్యకర్తకు 2 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. హోదా కోసం ఎంతో తాపత్రయపడి ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడి ఆశయం నెరవేరకపోగా, తమ కుటుంబానికి అందించాల్సిన ఆసరా కూడా దక్కలేదంటూ మునికోటి సోదరుడు మురళి వాపోతున్నాడు. ఈ క్రమంలో జనసేన తరపున ఆర్థిక సాయం ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఘటనకు సోమవారంతో ఏడాది నిండటం, వారి కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకున్న నటుడు, జనసేన అదినేత పవన్ కల్యాణ్ 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు ఆయన జనసేన కోశాధికారి మారిశెట్టి రాఘవయ్యకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడో, రేపో తిరుపతి వెళ్లనున్న రాఘవయ్య సదరు మొత్తాన్ని మునికోటి కుటుంబానికి అందజేయనున్నారు.

తన ప్రచారంతో కూటమిని అధికారంలోకి తెచ్చిన పవన్ ఆపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చానంటూ గతంలో చెప్పాడని, మరి హోదా పైన బీజేపీని ఎందుకు నిలదీయడం లేదంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి కుటుంబానికి ఎవరూ పట్టించుకోకపోయినా, ఆయన ఆర్థిక సాయం చేయటం ద్వారా వాళ్ల నోళ్లు మూయించినట్లు అయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  pawan kalyan  Muni koti  financial aid  5 lakhs donate  

Other Articles