బెలూచిస్థాన్ ఆస్పత్రి వద్ద బాంబు పేలుడు | Pakistan hospital bomb attack kills 42 in Quetta

Pakistan hospital bomb attack kills 42 in quetta

Bilal Anwar Kasi death, bomb blast in Balochistan, Balochistan Bar lawyers died

A bomb blast has killed 42 people at a hospital in the city of Quetta in south-west Pakistan, police say.

పాక్ లో భారీ బాంబు పేలుడు... 42 మంది మృతి

Posted: 08/08/2016 02:03 PM IST
Pakistan hospital bomb attack kills 42 in quetta

తీవ్ర వాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ మరోసారి దాని పంజాను రుచి చూడాల్సి వచ్చింది. దక్షిణ పాకిస్థాన్ లో సోమవారం ఉదయం శక్తివంతమైన బాంబు పేలుడు జరపటంతో దాదాపుగా 42 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ న్యాయవాది బిలాల్ అన్వర్ కాశిని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో నిన్న హత్యకు గురిగాక , బెలూచిస్థాన్ ప్రొవిన్స్ క్వెట్టా నగరంలోని ఓ ఆస్పత్రికి ఆయన మృతదేహాన్ని తరలించారు.

ఈ క్రమంలో బిలాల్ కు నివాళులర్పించేందుకు వందల సంఖ్యలో వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో మరో 50 మంది తీవ్రంగా పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది అడ్వకేటులు, మరికొందరు ఆ వార్తను కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ లు ఉన్నారు.  సరిగ్గా ఆసుపత్రి నుంచి అన్వర్ కాశి మృతదేహాన్ని తరలిస్తున్న వేళ బయట జనసందోహం ఎక్కువగా ఉండటంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు పేలుడు తర్వాత ఎమర్జెన్సీ వార్డు వద్ద తుపాకుల కాల్పులు కూడా వినిపించాయని ఓ ప్రముఖ పత్రిక ప్రకటించింది.

ఈ విషయమై ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ... శాంతికి విఘాతం కలిగించే ఎవరినీ వదలబోమని ప్రకటించాడు. మరోవైపు బెలూచిస్థాన్ ప్రొవిన్స్ ముఖ్యమంత్రి  సనావుల్లా స్పందిస్తూ..ఘటనలో కేవలం 30 మంది మరణించారని ప్రకటించాడు. భద్రతా వ్యవస్థ వైఫల్యమే ఘటనకు కారణమని చెప్పిన ఆయన, తానే స్వయంగా ఈ విషయంపై విచారణ జరిపిస్తానని ప్రకటించారు. ఒక్కడే ఈ ఆత్మాహుతి దాడి చేసినట్లు అనుమానిస్తుండగా, ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. ఇంకోవైపు బిలాల్ హత్యకు గురై 24 గంటలు గడుస్తున్నా కారణాలను మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bilal Anwar Kasi  Pak  hospital  bomb attack  terrorits  

Other Articles