Manmohan Singh responds on Special Status issue in Rajya Sabha

Manmohan singh urges nda govt to grant special status to ap

Former prime minister, manmohan singh, kvp ramachandra rao, special status to ap, ap special status issue Rajya Sabha, Rajy sabha manmohan singh, upa government, nsa government, modi, arun jaitley, andhra pradesh, chandrababu naidu, Ys jagan, Raghuveera reddy, rahul gandhi

Former prime minister manmohan singh responds on Andhra Pradesh Special Status issue in Rajya Sabha, says its union government task to fullfill my promises on bifurfication.

‘‘ఆ ఆరు హామీలను నేరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’

Posted: 08/05/2016 03:49 PM IST
Manmohan singh urges nda govt to grant special status to ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ సందించారు. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా అప్పటి ప్రధాన మంత్రి హోదాలో తాను ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఆయన ఇవాళ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని ముందస్తుగా భావించిన తాము ఏపీకి పలు హామీలను ఇచ్చామని.. అవి సభ అమోదం కూడా పోందాయని చెప్పారు.

గత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై వుందన్నారు. హామీలు అమలు చేసి సభ గౌరవం కాపాడాలన్నారు. సభ ఇచ్చిన హామీలకు నాటి కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. తాను ప్రధానిగా హామీ ఇచ్చానని, వాటిని మీ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అప్పట్లో ఎన్నికల షెడ్యూల్ ఉన్నందున తాను ఇచ్చిన హామీల అమలు ఆగిపోయిందని చెప్పారు. నాటి ప్రభుత్వం చట్టసభల్లో ప్రకటించిన హామీలను నేటి ప్రభుత్వం విస్మరించడం తగదని, అలా అయితే పార్లమెంటుపై ప్రజలకున్న నమ్మకం పోతుందన్నారు.

వెంటనే బీజేపీ నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చాలన్నారు. సభ్యుడి హక్కు కాలరాయడమే: కేవీపీ మాజీ ప్రధాని మన్మోహన్ మాట్లాడిన అనంతరం కేవీపీ సభలో మాట్లాడారు. తాను ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు పైన పదకొండు పార్టీలు మద్దతిచ్చాయని, వాటికి ధన్యవాదాలు అన్నారు. ప్రయివేటు బిల్లు సభ్యుడి హక్కు అన్నారు. ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్టం అవసరం లేదన్నారు. బీజేపీ దీనిని రాద్దాంతం చేస్తోందన్నారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లును మనీ బిల్లు అని చెప్పి బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

బిల్లును కాదనడం సభ్యుడి హక్కును కాలరాయడమే అన్నారు. ప్రయివేటు బిల్లు ద్రవ్య బిల్లు కాద్నారు. నాడు ప్రధాని హామీ ఇచ్చినందున ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్ట సవరణ అవసరం లేదని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వకండా ఎన్డీయే ఈ అంశాన్ని సంక్లిష్టం చేస్తోందని మండిపడ్డారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లు పైన ఓటింగ్ నిర్వహించాలని, డివిజన్ నిర్వహించాలని కేవీపీ చెప్పారు. ప్రయివేటు బిల్లును ఆమోదించిన తర్వాత ఆర్థిక బిల్లా కాదా తేల్చాలన్నారు. తన బిల్లుకు రాజ్యసభ సెక్రటరియేట్ అనుమతించిందిన్నారు. గతంలో ఈ బిల్లుపై కోరం వాయిదా పడిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  manmohan singh  ap special status  chandrababu  Ys Jagan  

Other Articles