sujana chowdary not interested in getting special status to ap

Sujana act in parliament is indifferent on special status to ap

sujana chowdary, union minister, jairam ramesh, manmohan singh, kvp ramachandra rao, special status to ap, ap special status issue Rajya Sabha, Rajy sabha manmohan singh, upa government, nsa government, modi, arun jaitley, andhra pradesh, chandrababu naidu, Ys jagan, Raghuveera reddy, rahul gandhi

union minister sujana chowdary act is indifferent on Andhra Pradesh Special Status issue in Rajya Sabha, which resembles that he dont need any special status to his state.

హోదాపై చర్చ అగగానే.. చప్పట్లు కోట్టి.. బల్లలు చర్చిన సుజనా

Posted: 08/05/2016 08:04 PM IST
Sujana act in parliament is indifferent on special status to ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. టీడీపీ నిజస్వరూపం బయటపడిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రమంత్రి అయినంత మాత్రన ఆయన మూలాల మర్చిపోయి.. రాష్ట్రానికి చెందిన వ్యక్తినన్న విషయాన్ని కూడా మర్చిపోయారని అక్షేపిస్తున్నాయి. టీడీపీ మీడియా ముందు చేస్తున్న ప్రగల్భాలు ఒకలా వుంటే.. అసలు దాని నైజం భిన్నంగా వుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మీడియా ముందు అంగలార్చుతున్న టీడీపీకి.. చిత్తశుద్దిని శంఖించాల్సి వస్తుందని కూడా విపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా మండిపడుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచందర్ రావు తెచ్చిన ప్రైవేటు బిల్లుపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక స్థాయిలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కు రాజ్యసభ డిఫ్యూటీ చైర్మన్ కురియన్ కు మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం కూడా జరిగింది. కేవీపీ ప్రవేశపెట్టింది ద్రవ్య బిల్లు కాదని, దీనిపై చర్చ జరగాలని, అనాటి రాష్ట్ర పునర్విభజన ఘట్టంలో జరిగిన పరిణామాలను కూడా జైరాం రమేష్ ఊటంకిస్తుండగా, దానిని కురియన్ అడ్డుకున్నారు. దీనిపై ఓటింగ్ కోసం పట్టుబడుతుండగా పార్టీలకు అతీతంగా దానికి మద్దతివ్వాల్సిన టీడీపీ అందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. బిల్లు ఆర్థిక బిల్లని దానిపై లోక్ సభోలోనే ముందుకు వెళ్లాలని అరుణ్ జైట్లీ చెప్పగానే కాంగ్రెస్ సభ్యులు మూకుమ్మడిగా ఖండిస్తుండగా ఆ బిల్లుపై నిర్ణయాన్ని లోక్ సభకు స్పీకర్ కురియన్ వదిలేశారు.  

కేవీపి పెట్టింది ఆర్థిక బిల్లా కాదా అనే విషయం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని కురియన్ రూలింగ్ ఇవ్వగానే కేంద్ర మంత్రి సుజనా చౌదరీ చక్కగా చప్పట్లు కొట్టేశారు. సుజనా చౌదరి చప్పట్టు కొట్టగానే కాంగ్రెస్, వైసీపీ సహా పలు విపక్ష పార్టీలు విస్తుపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న చర్చలో సుజనా ఎందుకు విరుద్ధంగా వ్యవహరించారని అశ్చర్యానికి గురయ్యాయి. నిన్నటి వరకు కేవీపీ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించిన సుజనా అనూహ్యంగా చేసిన ఈ వింత ప్రవర్తన పలువురికి ఇబ్బంది కలిగించింది. బీజేపీ సభ్యులతో కలిసి బల్లలు చరుస్తూ సుజనా చౌదరి ఉత్సాహంగా కనిపించారు. దీంతో ఆయన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హోదా విషయంలో ఎటూ తేల్చని బీజేపీ సభ్యులతో ఆయన జతకట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఓ పక్క బిల్లుపై ఓటింగ్ కోసం నిరసన చేపడుతుండగానే టీడీపీ ఎంపీలంతా తమకు ఏమీ పట్టనట్లు సభ నుంచి వెళ్లడం కూడా విమర్శలకు తావిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  sujana chowdary  ap special status  KVP ramchandra rao  chandrababu  Ys Jagan  

Other Articles