West Bengal to be renamed Bangla or Bongo, Bengal in English

East or west bangla is the best

West Bengal, name change, Bengal, Bangla, Banga, west bengal, west bengal new name, bengal new name, bongo, bangla, tmc, mamata banerjee, west bengal news, india news

Mamata Banerjee has finally set right a historically wrong, calling a state in the east west. Yes it is confusing, exactly the point she would have used to drive home the point.

కలకత్తా కోల్‌కతా అయినట్లు.. పశ్చిమ బెంగాల్ కూడా..

Posted: 08/02/2016 05:08 PM IST
East or west bangla is the best

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పేరు మారబోతున్నది. ఆ రాష్ట్రాన్ని ఇక నుంచి ఆంగ్లంలో ‘బెంగాల్‌’గా, బెంగాలీ భాషలో అయితే ‘బంగో’ లేదా ‘బంగా’గా పిలువాలని నిర్ణయించారు. ఈ మేరకు పేరు మార్పు ప్రతిపాదనకు బెంగాల్‌ కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. పేరు మార్పు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ తీర్మానం ఆమోదం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ఈ తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే.

ఒకప్పుడు వంగ దేశంగా పిలువబడిన పశ్చిమ బెంగాల్‌ పేరుమార్పు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే.. ఇక ఆంగ్లంలో ఆ రాష్ట్రాన్ని బెంగాల్‌గా పిలువాల్సి ఉంటుంది. ఈ మేరకు పేరుమార్పు కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే స్థానికులు మాట్లాడరీతిలోనే నగరం పేరు ఉండాలనే ఉద్దేశంతో కలకత్తా పేరును కోల్‌కతాగా మార్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్‌ పేరును కూడా రాష్ట్ర ప్రజలు పలికే రీతిలో బెంగాల్‌, బంగాగా మార్చాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamata banerjee  West Bengal  name change  Bengal  Bangla  Banga  

Other Articles