లాటరీ తగిలిన ఆనందంలో బాస్ పై మూత్రం పోశాడు | Lottery winner peeing on boss after scooping jackpot

Lottery winner peeing on boss after scooping jackpot

Lottery winning guy peeing, man urinate on boss, lucky guy urinate office, man urinate on boss

Lottery winning guy peeing on boss after scooping jackpot.

ITEMVIDEOS:లాటరీ తగిలింది. సంతోషంలో బాస్ పై ఉ* పోశాడు

Posted: 08/02/2016 04:35 PM IST
Lottery winner peeing on boss after scooping jackpot

సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలితే ఏం చేస్తాం? ఎగిరి గంతేస్తాం... ఆపై ఆ ఆనందాన్ని ఏదో ఒక రూపంలో అందరితో పంచుకుంటాం. కానీ, ఇక్కడ అలాగే లాటరీ తగిలిన ఓ వ్యక్తి చేసిన ప్రవర్తన చూస్తే ఎవరికైనా మతిపోవటం ఖాయం. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

లండన్ లోని ఓ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తికి ఓ లాటరీలో బంఫరాఫర్ గెలుచుకున్నట్లు సందేశం వచ్చింది. అంతే లాటరీ తగిలిన వ్యక్తి మనలాగానే ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. అందరూ సీరియస్ గా విధుల్లో నిమగ్నమై ఉన్న వేళ... కుర్చీలోనే గంతులు వేశాడు. ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి అటూ ఇటూ పరుగెత్తాడు. దీంతో అతని సహచరులంతా షాక్ కు గురయ్యారు.

వారు తేరుకునేంతలో ఆ వ్యక్తి నేరుగా బాస్ రూంలోకి వెళ్లాడు. బాస్ ను కుర్చీలోంచి కిందపడేసి, అతని కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. దాని నుంచి ఆయన తేరుకునేలోపు బాస్ టేబుల్ పైకి ఎక్కి ఆయన సెక్రటరీ అక్కడే ఉందన్న ఇంగితం మరచి యూరిన్ పోశాడు. తరువాత అరుచుకుంటూ బయటకి వెళ్లిపోయాడు. అనంతరం అసలు ఏం జరిగిందని అతని కంప్యూటర్ చూసిన సహచరులు అతనికి లాటరీ తగిలిందని తెలియగానే...జాక్ పాట్ తగిలిందన్న ఆనందంతో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించాడని వారు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lottery winner  urinate  boss  video  

Other Articles