Rajinikanth watches Kabali with fans in US, gets standing ovation

Rajinikanth watched kabali movie with fans

rajinikanth, rajinikanth kabali, kabali, kabali screening, kabali fans screening, rajinikanth kabali fans, rajinikanth fans, kabali us, kabali us release, kabali movie, entertainment news

Rajinikanth’s Kabali had a special screening in the US, and the fans got a special surprise. They got to see Rajinikanth’s film with the superstar himself.

అభిమానులను సంభ్రమాశ్చర్యంలో ముంచిన కబాలి

Posted: 07/22/2016 07:43 AM IST
Rajinikanth watched kabali movie with fans

అగ్రరాజ్యం అమెరికాలోని అభిమానులను దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని అమెురికాలో ఫ్యాన్స్ కోసం ఒక రోజు ముందుగానే ప్రత్యేక షో వేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోకు హాజరైన అభిమానులు రియల్ కబాలీని ప్రత్యక్షంగా చూడగలిగారు. ప్రత్యేక షోకు రావడం తమకు డబుల్ దమాకా తగిలిందని అభిమానులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం సంచలనంగా మారింది.

రజనీకాంత్ ధియేటర్ లో చూసిన అభిమానులు కలోనిజమో తేల్చుకోలేకపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకునేందుకు వారికి కొన్ని నిమిషాలు పట్టింది. అనంతరం ‘తలైవా’కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అభిమానుల మధ్య కూర్చుని రజినీకాంత్ సినిమాను వీక్షించారు. పలు సీన్లకు అభిమానులు కేరింతలు కొట్టారు. హర్షధ్వానాలతో హాలు దద్దరిల్లింది. రజినీ అభిమానులకు ఈ సినిమా పండగేనని సినిమాను చూసిన భారతీయ అమెరికన్లు తమ స్పందన తెలియజేశారు. భారత్‌నే కాదు.. అమెరికానూ కబాలి ఫీవర్ పట్టిపీడించింది. సినిమా టికెట్లు హాట్ కేకులయ్యాయి. ప్రీబుకింగ్ టికెట్లు మొదటి రెండు గంటల్లోనే అమ్ముడైపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  kabali  screening  us fans  surprise  entertainment  

Other Articles