BJP MP Jagdambika Pal involved in high-profile sex racket?

Sex racket busted accused posed as mp to seek favours

sex rocket, high profile prostitution, income tax raids, delhi police, High-profile sex racket, Jagdambika Pal, Naresh Agarwal

BJP MP Jagdambika Pal has come under scanner after his alleged role in sex racket. The Delhi Police on Thursday busted a high profile sex racket in Safdarjung area.

ఢిల్లీలో హై ప్రోఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..

Posted: 07/22/2016 06:51 AM IST
Sex racket busted accused posed as mp to seek favours

దేశ రాజధానిలో భారీ హైప్రోఫైల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. తానోక పార్లమెంటుసభ్యుడిగా నటిస్తూ.. ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్న ప్రధాన నిందితుడు ప్రితీంద్రనాథ్ సన్యాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ సెక్స్ రాకెట్ గుట్టును ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం కలిగి పోలీసులకు ఉప్పందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుమారుగా నెల రోజుల క్రితం సన్యాల్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు అతడితో పాటు ఉజ్బెకిస్థాన్కు చెందిన ఓ మహిళ ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఉప్పందించారు.

అరెస్టయిన సన్యాల్తో పాటు ఉజ్బెక్ మహిళ అందించిన సమాచారం ఆధారంగా రిటైర్డ్ కల్నల్ అజయ్ అహ్లావత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. తనను పెద్దమనుషుల వద్దకు పంపేవారని, వాళ్లలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఆయుధ డీలర్లు, రాజకీయ నాయకులు, ఆర్మీ ఆఫీసర్లు కూడా ఉండేవారని ఉజ్బెక్ మహిళ తెలిపింది. సన్యాల్ ఇంటిమీద దాడి చేసినప్పుడు పోలీసులకు ఫోర్జరీ చేసిన ఎంపీల లెటర్‌హెడ్లు కూడా దొరికాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్లా నటించి.. ఉన్నతాధికారులతో పనులు చేయించుకునేవాడు.

దక్షిణాసియా దేశాలకు చెందిన పలువురు మహిళల పాస్పోర్టుల కాపీలు, ఫోన్ నంబర్లుతో పాటు వారితో సాగించిన అర్థిక లావాదేవీల వివరాలు కూడా సన్యాల్ ఫోన్ మెసేజిలలో వున్నాయని డీసీపీ ఈశ్వర్ సింగ్ చెప్పారు. ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు ఉజ్బెక్ మహిళ తాను అనుభవిస్తున్న నరకాన్ని వాళ్లకు వివరించి, తనను కాపాడాల్సిందిగా కోరింది. దాంతో వాళ్లు పోలీసులకు విషయం చెప్పారు. చివరకు మొత్తం రాకెట్ వ్యవహారాన్ని బయటకు లాగిన పోలీసులు.. సన్యాల్ మీద ఐపీసీ సెక్షన్లు 370, 370ఎ, 341, 342, 419, 120బి కింద కేసులు పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles